Begin typing your search above and press return to search.
తండ్రికి వైరస్ అనుమానితురాలి అంతిమవీడ్కోలు ..3 నిముషాలే టైమ్ ..!
By: Tupaki Desk | 5 Jun 2020 3:00 PM GMTగత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన తండ్రికి అంతిమ వీడ్కోలు కోసం ఓ కరోనా అనుమానితురాలికి కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. ఓ అంబులెన్స్ లో ఆమెను ఇంటివరకు తీసుకొచ్చిన వైద్యులు.. స్టాప్ వాచ్ ల్లో సమయం పెట్టుకొని, కేవలం మూడు నిముషాలు ఉంచి మళ్లీ ఆ యువతిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
మనసుల్ని కబళిస్తున్న ఈ ఘటన మణిపూర్‌లో జరిగింది. మణిపూర్ లోని కాంగ్ పోక్పికి చెందిన అంజలి హమంగ్తే అనే యువతి గత నెల 25న శ్రామిక్ రైల్ లో చెన్నై నుంచి ఆ రాష్ట్రానికి చేరుకుంది. అయితే ఆమెతో ప్రయానించిన మరొకరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అంజలిని కూడా క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. మరోవైపు ఆమె తండ్రి ఇటీవల మరణించారు. దీంతో తన తండ్రికి అంతిమ వీడ్కోలు పలికేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె అధికారులకు విఙ్ఞప్తి చేశారు.
ఆ విఙ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. ఆమెకు పీపీఈ కిట్ వేయించి, ప్రత్యేక అంబులెన్స్ లో గురువారం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఉండటానికి ఆమెకు 3 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. మూడు నిమిషాలు గడుస్తూనే అంజలిని అక్కడి నుంచి క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. ఆ సమయంలో అంజలి దగ్గరకు కుటుంబసభ్యులను కూడా రానివ్వలేదు. కాగా మణిపూర్ లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది.