Begin typing your search above and press return to search.
బాల్క సుమన్ బజ్జీలు రాలగొడుతరు
By: Tupaki Desk | 26 Dec 2016 4:27 PM GMTతెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై విమర్శలు చేసిన టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మేడిపల్లి సత్యం ఘాటు విమర్శలు చేశారు. కోదండరాం పై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నామని వివరించారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ పై ఓ విద్యార్థిగా మాట్లాడాల్సిన మాటలు కావని సత్యం తప్పుపట్టారు. ఎంసెట్ పేపర్ లీక్ - సింగరేణి ఉద్యోగ నియామక అక్రమాల్లో బాల్కసుమన్ ప్రధాన నిందితుడని ఆరోపించారు. స్థాయికి మించి ప్రొఫెసర్ కోదండరాం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ వాదులు బాల్కసుమన్ బజ్జీలు రాలగొట్టడం ఖాయమని హెచ్చరించారు. విద్యార్థినాయకుడిగా ఏనాడైనా విద్యార్థి సమస్యలపై స్పందించావా అని ప్రశ్నించారు.
బాల్క సుమన్ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడివి అయితే ఉస్మానియా సమస్యలపై ఎందుకు స్పందించరని మేడిపల్లి సత్యం నిలదీశారు. మెస్ బకాయిల విడుదలపై ఎందుకు కేసీఆర్ ను నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేవలం వార్తపత్రికలలో హెడ్ లైన్ కోసం పిచ్చిపట్టిన కుక్క మాదిరిగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉండటమే కాకుండా...సింగరేణిలో అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా అనర్హులకు కట్టబెట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ స్కాం - సింగరేణి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే నేను నిరూపించడానికి సిద్దంగా ఉన్నాననని మేడిపల్లి సత్యం సవాల్ విసిరారు. ఈ ఆరోపణపై ఉస్మానియా యూనివర్సిటీలోగానీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గానీ బహిరంగ చర్చకు సిద్దమా? చిత్తు కాగితం మహా గ్రంథాలయంలోకి కొట్టుకవచ్చి మహా గ్రంథాలయాన్నే వెక్కిరించినట్లుగా బాల్క సుమన్ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అడిగితే నీ చరిత్ర ఏమిటో ఎవరైనా చెబుతారని...ఉద్యమ ముసుగులో ఫెయిల్ అయిన విద్యార్దులను పాస్ చేయిస్తూ వారి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసిన చరిత్ర సుమన్ దని విమర్శలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/