Begin typing your search above and press return to search.

నాపై చెయ్యేస్తే చచ్చిపోతా: మోడీ, స్టాలిన్ లకు నటి పోస్టు..

By:  Tupaki Desk   |   15 Aug 2021 5:30 AM GMT
నాపై చెయ్యేస్తే చచ్చిపోతా: మోడీ, స్టాలిన్ లకు నటి పోస్టు..
X
కొందరు సినీ హీరోయిన్లు సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా రియల్గా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. సినీ ఇండస్ట్రీలో తమకొచ్చిన కష్టాన్ని చెబుతున్నక్రమంలో హద్దులు దాటుతారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారు చిక్కుల్లో పడుతారు. ఆ తరువాత కేసులు నమోదు కావడంతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటీవల ఓ నటి దళిత కులాలపై వివిదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమెను అరెస్టు చేసే ప్రయత్నంలో గందరగోళం సృష్టించింది. ఈక్రమంలో ఆ నటి ముఖ్యమంత్రి, ప్రధానిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆ వ్యాఖ్యలు చేస్తుండగా కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

సినిమాల్లో చాలా మందికి అనుకున్న అవకాశాలు రావు. దీంతో కొందరు ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. కొందరు ఏదో రకంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిపోతారు. అయితే కొందరు తమకు జరిగిన ఇబ్బందులను తట్టుకోలేరు. చాలా మంది పెద్దలు సినిమా రంగం అంటే పూల పాన్పు కాదు. ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుందని చెబుతూ ఉన్నారు. అయినా కొందరు రంగుల ప్రపంచం అంటూ ఈ ఫీల్డులోకి దిగుతున్నారు. ఆ తరువాత అక్కడ జరిగే పరిణమాలను తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో గీత దాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

కేరళకు చెందిన మీరా మిథున్ తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. అయితే ఆ తరువాత తనకు అవకాశాలు ఇవ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఓ వర్గంపై ప్రత్యేకంగా దూషణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళ సినీ ఇండస్ట్రీలో దళితులను తరిమేయాలని వ్యాఖ్యలు చేసింది. ఓ డైరెక్టర్ తన ఫొటోను దొంగిలించి ఫస్ట్ లుక్ కోసం వాడుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని షెడ్యూల్డ్ కూలాలందరిని తప్పనిసరిగా తప్పించాలని ఆమె వివాదాస్పదంగా మాట్లాడింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఈనె 7న సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియో వైరల్ కావడంతో దళిత సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు మీరా మిథున్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్ 153, 153 ఎ(1), 505 (1) (బి), 505(2) మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అనేక కేసులు నమోదు చేశారు. దీంతో అమెను అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ పోస్టులపై మీరా మిథున్ స్పందించారు. తనను అరెస్టు చేయడం సాధ్యం కాదని అన్నారు. వాళ్లకు సాధ్యమైతే నన్ను అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరింది. తనను అరెస్టు చేయడం కలలోనే జరుగుదుందని చెప్పింది.

అయితే 14న మీరా మిథున్ ను పోలీసులు కేరళలో కనుగొన్నారు. అయితే ఆమెను అరెస్టు చేయడానికి ముందు మీరా మిథున్ ఆందోళన చేశారు. అమెను అరెస్టు చేయడానికి ముందుకు పోలీసులు ఆమెను ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడుగుతున్న వీడియో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనపై చెయ్యేస్తే చనిపోతానని ప్రధానమంత్రి మోడికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆమె పోస్టు చేశారు. కాగా తన ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి నిరాకరించింది. తనను అరెస్టు చేసే హక్కు లేదని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.