Begin typing your search above and press return to search.
నిత్యానందస్వామిపై నటి మీరామిథున్ సంచలన వీడియో
By: Tupaki Desk | 14 March 2020 4:16 AM GMT8 తొట్టక్కల్ - థానా సెండ్ర కొట్టం - బోధాయి యెరి బుధీ మారి తదితర తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నటి మీరా మిథున్ వివాదాస్పద నిత్యానందస్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఓ వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఆమె తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ 3 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఆమె కేవలం గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు రాజకీయపరమైన కామెంట్లు కూడా చేస్తుంది. తాజాగా ఆమె నిత్యానందపై ఓ వీడియో రిలీజ్ చేసింది. తన భక్తులకు నిత్యానంద సూచించిన లివింగ్ ఎన్ లైట్ మెంట్: గోస్పెల్ ఆఫ్ పరమహంస పుస్తకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పుస్తకాన్ని చదువుతూ వీడియోను షూట్ చేశారు.
మీరా మిథున్ ఆ వీడియోలో.. నిత్యానంద గురించి మాట్లాడారు. అద్భుతమైన పుస్తకంలో ఆయన భగవంతుడిగా తనకు తాను ప్రకటించుకున్నారని, దేవదూతను అనే విషయాన్ని ఖండించారని తెలిపారు. మీరా మిథున్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు సహా నెటిజన్ల నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ప్రస్తుతం నిత్యానంద పరారీలో ఉన్నాడు. అహ్మదాబాద్ లోని ఆశ్రమంలో భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారని - చిన్నారుల వేధింపులు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుండి అతను కనిపించడం లేదు. అతను విదేశాలకు పారిపోయాడు. పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రంజిత వ్యవహారంతో నిత్యానంద లీలలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
వీడియో కోసం క్లిక్ చేయండి