Begin typing your search above and press return to search.
వావ్.. మీరాచాను చేసిన తాజా పని తెలిస్తే ఇట్టే ఫిదా అయిపోతారు
By: Tupaki Desk | 12 Aug 2021 5:30 AM GMTఅన్నం పెట్టిన చేతిని మర్చిపోకూడదంటారు. చేసిన మేలును కొందరు ఇట్టే మర్చిపోతారు. కానీ.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా గుండెల్లో గుర్తుంచుకుంటారు. సరైన సమయం వచ్చినంతనే వడ్డీతో సహా తీర్చేస్తారు. ఇప్పుడు అలాంటి పనే చేతల్లో చేసి చూపించారు మీరా చాను. ఒలింపిక్స్ లో భారత్ ప్రయాణం మొదలైన మొదటి రోజునే రజత పతకాన్ని సొంతం చేసుకొని మంచి ప్రారంభాన్ని మొదలు పెట్టారు మీరాచాను. దీంతో.. ఆమెపై దేశ వ్యాప్తంగా అభినందనల వర్షం కురిసింది.
ఒలింపిక్ విజయంతో ఆమెకు ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. బంధువులు.. స్నేహితులు.. క్రీడాభిమానులు ఇలా ఒకరేంటి.. అందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటివేళ.. ఆమె మాత్రం మరో పనిలో బిజీబిజీగా పని చేసింది. శిక్షణ కోసం తన ఇంటి నుంచి ఇంఫాల్ లో ఉన్న ట్రైనింగ్ అకాడమీకి వెళ్లేందుకు చేతిలో డబ్బుల్లేని పరిస్థితి. ఇలాంటివేళ.. లారీ డ్రైవర్లను లిఫ్టు అడిగి అకాడమీకి చేరుకునేది. అలా తనకు సాయం చేసిన లారీ డ్రైవర్లను వెతికే పని మొదలుపెట్టింది.
తనకు సాయం చేసిన 150 మంది ట్రక్ డ్రైవర్లను గుర్తించిన ఆమె.. వారందరికి ఒకచోటుకు చేర్చటమే కాదు.. వారికి మంచి భోజనం పెట్టి.. కొత్త బట్టలూ.. మణిపురి స్కార్ఫ్ ను బహుమతిగా ఇచ్చిన తన అభిమానాన్ని ప్రదర్శించింది. ఇంఫాల్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తమ టీ షాపు ముందు నుంచే లారీలు వెళ్లేవి. డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే.. పెద్ద మనసుతో వారు చానుకు లిఫ్టు ఇచ్చేవారు.
ఇలా వారు చేసిన మేలును తాను ఎప్పటికి మర్చిపోలేనని చెప్పిన ఆమె.. ఇలా అయినా తాను వారి రుణాన్ని కొంతైనా తీర్చుకున్నట్లుగా చెప్పింది. చానులోని ఇంత పెద్ద మనసును తెలుసుకున్న వారంతా ఆమెకు ఫిదా అయిపోయే పరిస్థితి. విజేతలు ఉత్తినే రారు.. కఠినమైన పరిశ్రమ.. అంతకు మించిన క్రమశిక్షణ.. పెద్ద మనసు.. సాయం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేని తత్త్వం వారిని స్టార్లుగా మారుస్తుందన్న విషయం చాను ఉదంతం చెప్పేస్తుందని చెప్పాలి. తాజాగా ఆమె చేసిన పని తెలుసుకున్న వారంతా ఆమెను అభినందిస్తున్నారు.