Begin typing your search above and press return to search.
విజయనగరం గజపతిరాజుల లొల్లి పీక్స్
By: Tupaki Desk | 25 Dec 2020 5:30 PM GMTగజపతిరాజుల లొల్లి మళ్లీ మొదలైంది. విజయనగరం జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలు అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. దీనికి సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మీసాల గీత మరలా తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం అని బోర్డు తగిలించారు. ఇదే ఇప్పుడు పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది.
అశోక్ గజపతిరాజు, మీసాల గీత మధ్య టీడీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పార్టీ కార్యాలయాన్ని ఎత్తేయాలని ఆమె కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ వర్గానికి వ్యతిరేకంగా వారం రోజుల క్రితం ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే నేతల మధ్య చిచ్చు పెట్టింది.
గీతపై అశోక్ వర్గం అమరావతిలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతి రాజు బంగ్లాకు బదులు కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
అధిష్టానం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో మరో మారు తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం బోర్డును ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ కేడర్ లో ఉత్కంఠ కొనసాగుతోంది.