Begin typing your search above and press return to search.

రాజు గారి కోటలో నిరసన : మీసాలు తిప్పిన అసమ్మతి

By:  Tupaki Desk   |   19 Jun 2022 8:30 AM GMT
రాజు గారి కోటలో నిరసన :  మీసాలు తిప్పిన అసమ్మతి
X
ఆమె విజయనగరం నియోజకవర్గంలో చురుకైన మహిళా నాయకురాలు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆమె తండ్రి హయాం నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్న కుటుంబం. ఇక గీత ఫస్ట్ టైమ్ ప్రజరాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తొలి ప్రయత్నంలోనే దాదాపుగా ముప్పయి వేల ఓట్లను సాధించారు.

ఇక 2014 నాటికి ఆమె టీడీపీలో చేరి టికెట్ సంపాదించారు. వైసీపీ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి మీద 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఖాయం అనుకుంటే అశోక్ చక్రం తిప్పి ఆమెకు కాకుండా తన కుమార్తె అదితి గజపతిరాజుని బరిలోకి దింపారు. అదితి ఓడిపోయారు. దాంతో మీసాల గీత 2024 ఎన్నికల్లో టికెట్ తనకే అని భావిస్తూ వచ్చారు.

ఇవన్నీ పక్కన పెడితే అశోక్ బంగ్లాలో టీడీపీ ఆఫీస్ ఏంటి, అక్కడే పార్టీ కార్యకలాపాలు ఏంటి రాజా వారి పెత్తనమేమిటి అని ప్రశ్నిస్తూ ఆమె అశోక్ మీద అప్పట్లో తిరుగుబాటు జెండా ఎగరేశారు. సొంతంగా వేరే చోట టీడీపీ ఆఫీస్ పెట్టి కార్యకలాపాలు నడిపారు. అదే టైం లో మంగళగిరి వెళ్ళి మరీ చంద్రబాబుని కలసి పార్టీ టికెట్ తనకు కన్ ఫర్మ్ చేయమని కోరారని వార్తలు వచ్చాయి.

ఒక దశలో బాబు కూడా సామాజిక వర్గ సమీకరణల నేపధ్యంలో గీతకు చాన్స్ ఇద్దామనుకున్నారని టాక్. అయితే ఇపుడు సీన్ మారింది. మళ్లీ అశోక్ పరపతి పెరిగింది. ఆయన కూతురు గీత యాక్టివ్ అయ్యారు. ఆమెకే వచ్చే ఎన్నికల్లో టికెట్ అని తేలిపోయింది. ఈ పరిణామాల నేపధ్యంలో మీసాలా గీత ఏకంగా చంద్రబాబు విజయనగరం టూర్ కే డుమ్మా కొట్టేశారు.

అది బాబుకు స్పష్టంగా తెలియాలనే ఆమె చేశారని అంటున్నారు. అశోక్ పెత్తనం మీద బాబు ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత మీద అలిగి గీత ఇలా అధినేత ప్రోగ్రాం కి గైర్ హాజర్ అయ్యారని అంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేద్ని అంతా అంటున్నా కూడా గీత వర్గం మాత్రం తమాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే అని చెబుతున్నారు. మరి చంద్రబాబు గీత మాట వింటారా ఆమె తలరాత మారుస్తారా. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా అన్నది చూడాలి.

ఒకవేళ టీడీపీ టికెట్ దక్కకపోతే మాత్రం ఆమె పార్టీలో ఉండరని అంటున్నారు. జనసేన వైపు ఆమె చూస్తున్నారు అని కూడా టాక్. మరి అదే కనుక జరిగితే ఒక ప్రధాన సామాజికవర్గం నుంచి టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది చూడాలి. అలాగే అంతా బాగుంటుంది అనుకుంటున్న అశోక్ కి ఆయన వారసురాలి గెలుపునకు కూడా గీత అసంతృప్తి మళ్ళీ ఎదురు నిలిచి గండి కొడుతుందా అని కూడా చర్చ సాగుతోంది.