Begin typing your search above and press return to search.

డాన్సర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అయితే..!

By:  Tupaki Desk   |   11 Sep 2018 5:23 PM GMT
డాన్సర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అయితే..!
X
ఏ పని చేసినా ఎంజాయ్‌ చేస్తూ చేస్తే ఆ పనిపై కోపం - చిరాకు రాదు అంటారు. అయిష్టంతో చేసే పని ఎప్పుడు కూడా సంపూర్ణం అవ్వదని పెద్దలు అంటూ ఉంటారు. పోలీసులు తమ డ్యూటీని సక్రమంగా చేస్తే ఏ సమస్య ఉండదు. ముఖ్యంగా ట్రాఫిక్‌ పోలీసులు విధులను సరిగ్గా నిర్వర్థిస్తేనే రోడ్డుపై ఎలాంటి ప్రమాధాలు జరుగకుండా ఉంటాయి. ట్రాఫిక్‌ లో విధులు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఎండలో రోడ్డు మద్యలో నిల్చుని - వచ్చే పోయే వాహనాలకు సంజ్ఞలు చూపిస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పనిని ఎంజాయ్‌ గా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రతాప్‌ చంద్ర ఖండ్వాల్‌.

భువనేశ్వర్‌ లో మొన్నటి వరకు సివిల్‌ డిపార్ట్‌ మెంట్‌ లో హోంగార్డ్‌ గా విధులు నిర్వర్తించిన ప్రతాప్‌ చంద్ర ఈమద్య కానిస్టేబుల్‌ గా నియామకం పొందాడు. ప్రతాప్‌ చంద్ర మొదటి విధులను ట్రాఫికల్‌లో ఉన్నతాధికారులు వేయడం జరిగింది. మొదట కాస్త ఇబ్బంది పడ్డ ప్రతాప్‌ చంద్ర తనకు తెలిసిన డాన్స్‌ తో ట్రాపిక్‌ సంజ్ఞలు ఇస్తూ ట్రాఫిక్‌ ను నియంత్రించడం మొదలు పెట్టాడు. ప్రతాప్‌ చంద్ర విధులు నిర్వర్తించే ఏరియా గుండా వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్‌ సంజ్ఞలను పాటిస్తూ వెళ్తు ఉంటారు. తాజాగా ప్రతాప్‌ డాన్స్‌ చేస్తూ విధులు నిర్వర్తించడంను గమనించిన ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ప్రతాప్‌ డాన్స్‌ చేస్తూ ట్రాఫిక్‌ ను నియంత్రించే వీడియో వైరల్‌ అయ్యింది. దాంతో ప్రతాప్‌ కు మంచి గుర్తింపు వచ్చింది. మొదట్లో తాను ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తాను వాహనాలను ఆపేందుకు ప్రయత్నించినా కూడా కొందరు ఆపేవారు కాదని, దాంతో చిరాకెత్తి ఇలా డాన్స్‌ రూపంలో ట్రాఫిక్‌ ను కంట్రోల్‌ చేయడం స్టార్స్‌ చేశానంటూ ప్రతాప్‌ చెప్పుకొచ్చాడు. ఈయన కష్టంను ఉన్నతాధికారులు కూడా గుర్తించి అభినందించినట్లుగా తెలుస్తోంది.