Begin typing your search above and press return to search.
మరోసారి రేవంత్ పై సీనియర్ల గుర్రు: ప్రత్యేకంగా సమావేశం
By: Tupaki Desk | 20 March 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్ కు మళ్లీ కష్టాలొచ్చాయి..! పార్టీ అధ్యక్షుడి దూకుడుపై కొందరు సీనియర్ నేతలు గుర్రుగా ఉంటున్నారు. ఆయన తీరు సరిగా లేదని రహస్యంగా సమావేశం అవుతున్నారు. అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని, వన్ మాన్ షో ను కట్టడి చేయాలని రహస్య మీటింగ్ లో నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో భేటీ అయినా సీనియర్లు, మరోసారి సమావేశం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కిందిస్థాయి కార్యకర్తలో నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్లో ఎంతో కాలంగా కొనసాగుతున్న సీనియర్లు తాజాగా మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఓ వైపు అధికార పార్టీ కేంద్రంపై పోరుకు రెడీ అవుతుండగా.. బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ మాత్రం అసమ్మతి రాగంతో కొట్టుమిట్టాడుతోంది. కొద్ది కాలంగా తామంతా ఒక్కటే... ఇక పార్టీలో వర్గ విభేదాలు లేవనే సంకేతం ఇచ్చినా.. సీనియర్లు మరోసారి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
వీరంతా పీసీసీ చీఫ్ ను టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చాలా సార్లు సీనియర్లు భేటీ అయినా తాజాగా మాత్రం ఈ వ్యవహరంపై తేల్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఢిల్లీ కాంగ్రెస్ తహతహలాడుతుండగా తెలంగాణలో మాత్రం అసమ్మతి సమస్య వీడడం లేదు. ఓ వైపు ఎల్లారెడ్డిలో మీటింగ్.. మరోవైపు జీ-10 నేతల సమావేశం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇందులో ఎక్కువగా భవిష్యత్ రాజకీయ పరిణామాలు పీసీసీ చీఫ్ వన్ మాన్ షో గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
సుధీర్ఘ కాలంగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరువును తాజా చీఫ్ తన నిర్ణయాలతో తీస్తున్నారని, ఆయన వన్ మ్యాన్ షో ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తీరుతో కొంతమంది పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆపకపోతే భవిష్యత్ లో పార్టీ మనుగడ కష్టమవుతుందని అన్నారు. ఇప్పటికైనా పీసీసీ చీఫ్ తీరు మార్చుకోవాలని లేదంటే అధిష్టానానికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి నియామకం నుంచి కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగానే ఉంటున్నారు. వీహోచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకులు తమదైన శైలిలో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వెంటనే అసంతృప్తి నేతలందరినీ కలుస్తూ వచ్చారు. దీంతో పార్టీలో అసమ్మతి రాగం తొలగిపోయిందని భావించారు. కానీ హూజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత మరోసారి అసమ్మతి తీవ్రమైంది. అప్పటి నుంచి సీనియర్లు ప్రత్యేకంగా సమావేశమవుతూ రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు.