Begin typing your search above and press return to search.
వీర్రాజు బాగా ముదురేనా ?
By: Tupaki Desk | 2 Oct 2021 2:30 AM GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం మొదలైంది. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ఎవరు పోటీచేయాలనే విషయంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య భేటీ జరిగింది. భేటీలో అనేక విషయాలను చర్చించామని ఏ పార్టీ పోటీచేస్తుందనే విషయాన్ని తొందరలోనే ప్రకటిస్తామని వీర్రాజు చెప్పారు. బయటకు అయితే చెప్పలేదుకానీ బద్వేలు ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధినే పోటీచేయించాలని భేటీలో డిసైడ్ అయినట్లు సమాచారం.
జనసేన తరపున ఎవరు అభ్యర్ధిగా ఉంటారనేది పూర్తిగా జనసేన అంతర్గత వ్యవహారం కాబట్టి ఆ విషయంపై చర్చ జరగలేదు. విషయం ఏదైనా పోటీలో ఉండబోయేది జనసేన అభ్యర్ధే అనేది దాదాపు ఖాయమైపోయిన విషయం. ఇక్కడే వీర్రాజు ఎంత ముదురో అర్ధమవుతోంది. ఎందుకంటే ఆమధ్య తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరిగినపుడు కూడా రెండుపార్టీల మధ్య ఇలాంటి చర్చే జరిగింది.
నిజానికి బీజేపీకి బలం లేకపోయినా, జనసేనకు బలం ఉందని వాళ్ళు చెప్పుకన్నా పోటీచేసింది మాత్రం కలమంనేతే. సరే అప్పుడు జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. బీజేపీ అగ్రనేతలు క్యాంపుచేసినా, ప్రచారం చేసినా చివరకు పవన్ ప్రచారం చేసినా ఉపయోగం కనబడలేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ అలాంటి పరిస్ధితే బద్వేలు ఉపఎన్నిక రూపంలో రెండుపార్టీల ముందుకు వచ్చింది.
ఇఫుడు పోటీచేసే అవకాశం ఉద్దేశ్యపూర్వకంగానే జనసేన కు వీర్రాజు వదిలేశారట. ఎందుకంటే ఇక్కడ కూడా రెండుపార్టీలకు ఏమాత్రం బలంలేదు. ఒకసారి పోటీచేసి తిరపతిలో తలబొప్పి కట్టింది. కాబట్టి ఈసారి ఆ అవకాశం జనసేనకు వదిలేస్తే బాగుంటుందని వీర్రాజు అనుకున్నారట. ఎలాగే జనసేనకు ఇక్కడ డిపాజిట్ రాదు కాబట్టి అప్పుడు తిరుపతిలో తమ అభ్యర్ధి ఓటమికి, బద్వేలులో జనసేన అభ్యర్ధి ఓటమితో స్కోరు లెవల్ అయిపోతుందని వీర్రాజు ఆల్ రెడీ డిసైడ్ అయిపోయారట. మొత్తానికి వీర్రాజు మహా ముదురనిపించుకుంటున్నారు.