Begin typing your search above and press return to search.
విభజన సమస్యలపై భేటీ.. తెలంగాణ 5 పేజీల నోట్.. ఏపీ మాత్రం నో నోట్
By: Tupaki Desk | 28 Sep 2022 5:24 AM GMTమాటలకు చేతలకు మధ్య తేడా ఎంతన్న విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఏపీ రాష్ట్ర విభజన తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కొత్త రాష్ట్రం కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అప్పట్లో మాట్లాడుతూ.. విభజనకు కేంద్రం ఓకే చెప్పాలే కానీ.. విభజన అంశాలన్ని మహా అయితే గంటల వ్యవధిలో పూర్తి అవుతాయని చెప్పేవారు. ఆయన నోటి నుంచి వచ్చే మాటల్ని చూసినోళ్లు.. రెండు రాష్ట్రాల విభజన ప్రక్రియ ఇంత సింఫులా? అని ఆశ్చర్యపోతే.. తన మాటే నిజమని చెప్పేవారు. కట్ చేస్తే.. ఇప్పటికి విభజన జరిగి దాదాపు ఎనిమిదిన్నరేళ్లు అవుతోంది.
ఇప్పటికి విభజన పంచాయితీలు ఒక కొలిక్కి రాకపోవటమే కాదు.. మరెన్ని సంవత్సరాలు పడతాయో కూడా చెప్పలేని పరిస్థితి. విభజన విషయంలో ఏపీకి రావాల్సిన నిధుల గురించి.. వాటా గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తే అభ్యంతరాలు.. అంతకంతకూముదిరిపోవటం.. వాటి లెక్క తేల్చేందుకు కోర్టుల్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఎప్పటికి ఈ లెక్క తేలుతుందన్న విషయాన్ని చెప్పలేని పరిస్థితి.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న విభజన సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు కానీ.. పంచాయితీల అంశాలేవీ పెద్దగా లెక్క తేలని పరిస్థితి. ఏపీ అడిగిన డిమాండ్లకు తెలంగాణ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. కొర్రీలు పెట్టటంతో అడుగుముందుకు పడని పరిస్థితి.
ఈ సమావేశం గంటల కొద్దీ సమయం సాగినా.. సానుకూల ఫలితం మాత్రం పెద్దగా వచ్చిందేమీ లేదు. నిజానికి ఏపీ అడిగిన డిమాండ్లకు తెలంగాణ అధికారులు కొర్రీ పెట్టిన వైనంతో.. చర్చలు ముందుకు సాగిన పరిస్థితి లేదు.
కాకుంటే.. సమావేశం పూర్తి అయిన తర్వాత.. భేటీలో ఏయే అంశాలపై చర్చ జరిగిందన్న విషయంతో పాటు.. ఏపీ అధికారులు ఏం అడిగితే.. తాము ఎలా స్పందించామన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున విడుదలైన నాలుగు పేజీల ప్రకటన చాలా విషయాల్ని వెల్లడించింది.
అదే సమయంలో.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కటంటే ఒక్క పేజీ కూడా వివరాల్ని వెల్లడించలేదు. భేటీలో ఏం జరిగిందన్న దానిపై అధికారులు నోరు విప్పిన పాపాన పోలేదు. సమస్యలు పరిష్కారమయ్యాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. కనీసం బ్రీఫ్ గా అయినా సరే.. ఇలా జరిగిందన్న వివరాలు వెల్లడించకపోవటం ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.