Begin typing your search above and press return to search.

రగిలిన మెగా అక్వాఫుడ్ పార్క్ ఇష్యూ..

By:  Tupaki Desk   |   8 March 2017 10:20 AM GMT
రగిలిన మెగా అక్వాఫుడ్ పార్క్ ఇష్యూ..
X
నిరసన అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నేతల పుణ్యమా అని.. ప్రభుత్వ విధానాలపైనా నిరసన గళం విప్పితే చాలు.. శాంతిభద్రతల సమస్య పేరు చెప్పి గొంతు నొక్కేసే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మెగా అక్వాఫుడ్ పార్క్ ఉదంతంపై ఏపీ పోలీసులు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఈ మెగా పార్క్ ఇష్యూపై స్వచ్ఛంద సంస్థ ఒకటిగళం విప్పటం.. వ్యతిరేకంగా పోరాడటం తెలిసిందే. ఈ ఇష్యూ మీద జోక్యం చేసుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బాధితులు కలవటం.. వారి గోడువినిపించారు. దీనిపై ఏపీ సర్కారు రియాక్ట్ కావాల్సిందిగా చెప్పిన పవన్.. ఈ ఇష్యూలో తాను బాధితుల పక్షాన ఉంటానని చెప్పారు.

కట్ చేస్తే.. ఈ రోజున పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు.. పరిసర గ్రామాలకు చెందిన 30గ్రామాల ప్రజలు అక్వాఫుడ్ పార్క్ నువ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే.. నీటి వనరులు కలుషితం కావటంతో పాటు.. విష వాయువులతో పచ్చని పొలాలు నాశనం అవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామాల మధ్యలో కాకుండా.. దూరాన ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని వారు డిమాండ్చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కారు మాత్రం ఈ విషయంలోవెనక్కి తగ్గటం లేదు. పవన్ వినతి మేర.. రివ్యూ సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు.. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి..ఈ ఇష్యూను వదిలేశారు. అయితే.. ఈ ఇష్యూలో పెద్ద తలకాయల జోక్యం కారణంగానే బాబుఅంతగా స్పందించటం లేదన్న విమర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చేపట్టిన నిరసనను బలంగా అణిచివేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశాంతంగా ఉంటాయన్న పేరున్న గోదావరి జిల్లాల్లో అక్వాఫుడ్ పార్క్ నిరసనలు ఒక్కసారి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. వాస్తవానికి ఈ నిరసనలో ఏపీ పోలీసుల తీరును పలువురు ఖండిస్తున్నారు. వందలాది మంది మహిళల్ని.. చంటిపిల్లల తల్లులపైనా పోలీసులు ప్రతాపం చూపించి.. వారిని అరెస్ట్ చేయటాన్ని తప్పు పడుతున్నారు.

శాంతియుతంగా నిరసన నిర్వహించాలని తాము భావిస్తే.. పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. చాలా గ్రామాల్లోని పురుషుల్ని పోలీసులు అరెస్ట్ చేయటంతో.. కొన్ని గ్రామాల్లో పురుషులు కనిపించటం లేదన్నవాదన వినిపిస్తోంది. పోలీసుల తీరుతో పలు గ్రామాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 144 సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసులు మాటతో ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక.. నిరసనకు నాయకత్వం వహిస్తున్న నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బందానికి గురిచేయటం గమనార్హం. తాజాగా జరిగిన నిరసన ప్రదర్శన్ను పోలీసులు బలంగా అడ్డుకున్న వైనం.. బాధితుల పట్ల పోలీసులు అనుసరించిన వైఖరితో మెగా అక్వాఫుడ్ పార్క్ ఇష్యూ మరింత పెద్దదైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ విష‌య‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి విన్న‌వించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోవ‌డంతో స్థానికులు రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ - ప్ర‌ధాన‌ పార్టీలైన జ‌న‌సేన‌ - సీపీఎంల‌కు తమ ఆవేద‌న‌ను విన్న‌వించుకున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో బాధితులు స‌మావేశ‌మ‌య్యారు. వారికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మొండిగా ముందుకు పోవ‌ద్ద‌ని సూచించారు. సీపీఎం క్షేత్ర‌స్థాయిలో వారితో నిర్వాసితులతో స‌మావేశం అయి వారికి అండ‌గా నిలిచి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/