Begin typing your search above and press return to search.

ట్వీట్ వార్: మెగా బ్రదర్ vs స్టేట్ మినిస్టర్..!

By:  Tupaki Desk   |   12 April 2021 8:55 AM GMT
ట్వీట్ వార్: మెగా బ్రదర్ vs స్టేట్ మినిస్టర్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాకు ఏపీలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. టికెట్ ధరలను పెంచకుండా జీఓ జారీ చేయడంపై రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహాహం కోర్టులో ఉండగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీంట్లో మెగా బ్రదర్ నాగబాబు కలుగజేసుకుని ఏపీ మినిస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ట్వీట్ వార్ మొదలైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్.. పవన్ కు భయపడే 'వకీల్ సాబ్' సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమాను రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. 'వకీల్‌ సాబ్‌' సినిమాకు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధం ఏంటని ప్రశ్నించిన మంత్రి పేర్ని నాని.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజుకు 4 షోలకే అనుమతి ఉందని తేల్చి చెప్పారు. సినిమా హిట్ అయినంత మాత్రాన, తిరుపతిలో గెలవలేరని ఎద్దేవా చేశారు. అయితే దీనికి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"మీకు ఏమయ్యింది నాని గారు... మీరు కరోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే నాగబాబు చేసిన ఈ ట్వీట్‌ కి మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''పరోపకారి పాపన్న.. నాగబాబు గారూ, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్‌ కు రేబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం. వెంటనే ఆయనను వెతికి రేబిస్ వ్యాక్సిన్ వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా రేబిస్ వ్యాక్సిన్ అవసరం అవుతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు'' అని ట్వీట్ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు. మరి ఈ మెగా బ్రదర్ vs స్టేట్ మినిస్టర్ ట్విట్టర్ వార్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.