Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను ఆకాశానికెత్తేసిన `మెగా` హీరో!
By: Tupaki Desk | 29 Nov 2017 4:23 PM GMTహైదరాబాద్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న ప్రతిష్టాత్మక మెట్రో రైలును నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యతనివ్వడం విదితమే. కేటీఆర్ ను పిలిపించి ఆయన వచ్చిన తర్వాతే ప్రధాని మోదీ రిబ్బన్ కట్ చేయడంతో కేటీఆర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు, సినీ హీరోలు...కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. `మెగా`హీరో సాయి ధరమ్ తేజ్....మంత్రి కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ఈ సంఘటనతో కేటీఆర్ ....ఓ డైనమిక్ లీడర్ అని మరోసారి ప్రూవ్ అయిందని తేజూ చెప్పాడు.
మియాపూర్ మెట్రో స్టేషన్ లో రిబ్బన్ కట్ చేసేముందు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రధాని స్వయంగా కేసీఆర్ ను అడగడం, కేటీఆర్ వచ్చిన తర్వాత రిబ్బన్ కట్ చేయడం మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తేజూ స్పందించాడు. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో భాగంగా రిబ్బన్ కట్ చేయడానికి ముందు కేటీఆర్ ను ప్రధాని ఎందుకు పిలిచారో తనకు తెలియదని, కానీ, ఆయన వచ్చాక రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనమని తేజూ అన్నాడు. హైదరాబాద్ కు మరిన్ని ప్రాజెక్టులు రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు. మరో మైలురాయిని అధిగమించామని, మంత్రి కేటీఆర్ చొరవతో మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని టిఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ట్వీట్ చేశాఉ. కేటీఆర్ వ్యాపారవేత్తగానే కనిపించారని, ఎక్కడా రాజకీయ నాయకుడిగా కనిపించలేదని అన్నారు. కేటీఆర్ ఓ యూత్ ఐకాన్‌గా నిలిచారని అన్నారు. ఆయనతోపాటు కేటీర్ పై పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. ఐటీ శాఖ మంత్రి గానే కాకుండా, వ్యాపార వేత్తగా కేటీఆర్ తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. తెలంగాణలో ఐటీరంగం అభివృద్ధికి మంత్రి కేటీఆర్ విశేషకృషి చేస్తున్నారని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణి ప్రశంసించారు. హైదరాబాద్‌లో జీఈఎస్ సదస్సు నేపథ్యంలో సృజనాత్మక ఆవిష్కరణలకు స్టార్టప్‌లు ఆక్సీజన్ వంటివి. తెలంగాణ విజన్ కోసం వీటిని అమలుచేయడంలో మంత్రి కేటీఆర్‌కు ఇంకెవరూ సాటిరారు అని మంగళవారం ట్వీట్ చేశారు.