Begin typing your search above and press return to search.
మేఘా కృష్ణారెడ్డి చేతికి టీవీ9?
By: Tupaki Desk | 22 Aug 2018 8:02 AM GMTతెలుగు ప్రేక్షకుల మెప్పును, విమర్శలను ఒకేస్థాయిలో పొందుతున్న ప్రముఖ చానల్ టీవీ9 మేనేజ్‌మెంట్ మారనుందా? ఒక పారిశ్రామికవేత్త దానిని కొనుగోలు చేయనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా పలుమార్లు టీవీ9 విక్రయంపై వార్తలొచ్చినా అవేవీ నిజం కాలేదు. కానీ, ఈసారి మాత్రం డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది.
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీ9 - తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఉంది. స్టార్ మీడియా టీవీ9 ఛానల్‌ను కొనుగోలు చేస్తుందనే వార్తలు గతంలో జోరుగా వినిపించాయి. ఇటీవల మైహోం కన్‌స్ట్రక్షన్స్ అధినేత జూపల్లి రామేశ్వరావు టీవీ9ను కొనుగోలు చేస్తారనే వార్తలు బలంగా వినిపించాయి.
తాజాగా మరోసారి టీవీ9ను అమ్మకానికి పెట్టినట్లు తెలుగు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దేశంలో పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ టీవీ9ను కొనుగోలు చేసిందనే వార్తలు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే అనేక రంగాల్లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్న మేఘా కృష్ణారెడ్డి, మీడియా రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో భాగంగా టీవీ9ను కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది.
టీవీ9 చేతులు మారితే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ అండ చాలా అవసరం. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీపీఎంకి చెందిన 99 టీవీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మేఘా చేతిలోకి టీవీ9 ఛానల్ వస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందనే చర్చ అటు రాజకీయ వర్గాలతో పాటు, ఇటు మీడియా వర్గాల్లో జరుగుతోంది.