Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్ర సీఎం.. అవిశ్వాసంలో ఓటు వేస్తారట!
By: Tupaki Desk | 20 July 2018 5:19 AM GMTఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి?.. మోడీ సర్కారు మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పాల్గొనటం ఏమిటి? ఇదెలా సాధ్యమన్న డౌట్ అక్కర్లేదు. చిత్రవిచిత్రమైన కాంబినేషన్లు ఉండే ఇండియాలో ఇలాంటివన్నీ మామూలే.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కానీ.. ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాల్సి ఉంది. అదే సమయంలో ఈ రెండు కాకున్నా.. ఎలాంటి పోటీలోనూ గెలవకున్నా సీఎం కావొచ్చు. కాకుంటే.. సీఎం కుర్చీలో కూర్చున్న ఆర్నెల్ల వ్యవధిలో ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎంపిక కావాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం చూస్తే.. ఇదంతా కనిపిస్తుంది.
మరి.. పార్లమెంటులో జరిగే అవిశ్వాస తీర్మానానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఓటు వేస్తారన్న సందేహానికి వస్తే.. ఆ ఛాన్స్ మేఘాలయ ముఖ్యమంత్రి కన్నాడ్ కొంగల్ సంగ్మాకు దక్కింది.
బీజేపీ పొత్తుతో మేఘాలయలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కన్నాడ్. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆయన.. తుర ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ తన ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయలేదు. దీంతో.. ఆయన ముఖ్యమంత్రి కమ్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. తాజాగా మోడీ సర్కార్ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మకాం చేశారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ.. తన మిత్రుడికి సాయంగా ఉండేందుకు వీలుగా ఆయన ఢిల్లీకి వచ్చేశారు. ఓటింగ్ జరిగే పక్షంలో మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. లోక్ సభకు వచ్చి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. లోక్ సభలో ఎంపీగా ఓటు వేసిన ప్రత్యేకతను ఆయన సొంతం చేసుకునే వీలుందని చెప్పక తప్పదు.