Begin typing your search above and press return to search.

మేఘాలయ రాజ్ భవన్ లో రాసలీలలు

By:  Tupaki Desk   |   27 Jan 2017 5:00 AM GMT
మేఘాలయ రాజ్ భవన్ లో రాసలీలలు
X
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాల్సిన గవర్నర్.. నీచానికి ఒడికట్టిన సంచలన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ పై తీవ్ర ఆరోపణ ఒకటి బయటకు వచ్చింది. గవర్నర్ గా వ్యవహరిస్తున్న షణ్ముగనాథన్ పుణ్యమా అని రాజ్ భవన్ అమ్మాయిల క్లబ్ గా మార్చేశారన్న ఆరోపణలతో పాటు.. తీవ్రవిమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆరోపణలు గతంలో వచ్చినా ఖండించిన షణ్ముగనాథన్.. తాజాగా మాత్రం ఆయన తన పదవిని వదులుకోక తప్పలేదు.

గతంలోనూ ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. గత డిసెంబరులో రాజ్ భవన్ లోని పీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేయగా.. తనను పిలిపించిన గవర్నర్ షణ్ముగనాథన్.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. కౌగించుకొని ముద్దులు పెట్టుకోబోయారంటూ ఒక మహిళ ఆరోపించింది. అయితే.. ఆఆరోపణల్ని అప్పట్లో ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్యోగం రాని వారు అలాంటి ఆరోపణలే చేస్తారని వాదించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మేఘాలయ రాజ్ భవన్ లో పని చేసే ఉన్నతాధికారి మొదలు బంట్రోతు వరకూ అందరూ కలిసి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. రాజ్ భవన్ లో పని చేసే 98 మంది 11 అంశాలతో కూడిన ఒక ఫిర్యాదు మీద సంతకాలు చేసి ప్రధానికి పంపారు. ఇందులో తీవ్రంగా పరిగణించాల్సిన ఆరోపణలు చూస్తే.. ‘‘మేఘాలయ రాజ్ భవన్ రాసలీలలకు కేంద్రంగా మారింది. రాజ్ భవన్ గౌరవానికి గవర్నర్ మచ్చతెస్తున్నారు. గవర్నర్ ఆఫీసును ఆయన అమ్మాయిల క్లబ్బుగా మార్చేశారు. ఆయన ఆదేశాల మేరకు అమ్మాయిలు రాజ్ భవన్ కు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో చాలామంది గవర్నర్ పడగ్గదికి కూడా వెళ్తున్నారు. దీని వల్ల రాజ్ భవన్ భద్రతకుముప్పు వాటిల్లుతోంది. ప్రజా సంబంధాల అధికారులుగా ఇద్దరిని.. వంటమనిషి.. నర్సును గవర్నర్ నైట్ డ్యూటీకి నియమించుకున్నారని.. వారంతా మహిళలే’’ అంటూ మండిపడ్డారు.

షణ్ముగనాథన్ తీరుపైపెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటంతో ఆయన్ను పదవి నుంచి వైదొలగాలన్న ఆదేశం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మాటనునిజం చేస్తూ.. ఆయన.. తన పదవికి రాజీనామా చేయటం గమనార్హం. ఇక.. షణ్ముగనాథన్ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తే.. తమిళనాడుకు చెందిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా చెప్పాలి. 2015 మే నుంచి మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన.. 2016 ఆగస్టు వరకూ మణిపూర్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సెప్టెంబరు నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడా అదనపు బాథ్యల్ని ఆయన నిర్వర్తిస్తున్న తీరు చూస్తే.. బీజేపీ పెద్దల దగ్గర అయ్యగారి పరపతి అరచేతి మందాన ఉన్నట్లుగా కనిపించకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/