Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్ర హోం మంత్రి రేప్ చేశాడట
By: Tupaki Desk | 29 Jan 2017 4:58 AM GMTఎప్పుడూ పెద్దగా వార్తల్లోకి రాని మేఘాలయ.. గడిచిన నాలుగైదు రోజులుగా వరుస పెట్టి ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఆ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన షణ్ముగనాథన్ వివాదాస్పద వైఖరితో వార్తల్లోకి వచ్చిన ఆ రాష్ట్రం తాజాగా మరో మరకలాంటి ఉదంతంతో మీడియాకు ఎక్కింది. మేఘాలయ రాజ్ భవన్ ను..క్లబ్ గా మార్చేశారని.. రాజ్ భవన్ లో గవర్నర్ రాసలీలల్ని భరించలేని రాజ్ భవన్ అధికారులంతా కట్టుకట్టుకొని ప్రధానికి లేఖ రాయటంతో.. ఆయనపై వేటు పడిన పరిస్థితి.
దీనికి సంబంధించిన వరుస వార్తలు మీడియాలో ఎక్కుతున్న వేళ.. ఆ రాష్ట్ర హోంమంత్రిపై తీవ్ర ఆరోపణలు బయటకు వచ్చాయి. పద్నాలుగు సంవత్సరాల బాలికపై ఆ రాష్ట్ర హోంమంత్రి డోంకుపర్ రాయ్ అత్యాచారం చేశారన్న అభియోగాలు వచ్చాయి. ఇవిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. గవర్నర్ మీద రాసలీల అభియోగాలు వచ్చిన మూడు.. నాలుగు రోజులకే.. ఆ రాష్ట్ర హోంమంత్రిపై రేప్ ఆరోపణలు రావటం గమనార్హం.
హోం మంత్రి కుమారుడు షిల్లాంగ్ లో ‘‘మార్వలీన్స్ ఇన్’’ అన్న పేరు మీద ఒక గెస్ట్ హౌస్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో 14 ఏళ్ల బాలికపై నలుగురు వేర్వేరుగా అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా ఆరోపణలు వచ్చిన వారిలో మేఘాలయ రాష్ట్ర హోం మంత్రి ఒకరు కావటం గమనార్హం. తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. రాజీనామాకు మాత్రం హోం మంత్రి ససేమిరా అంటున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపేందుకు పోలీసులకు తాను పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని.. వారు విచారించి.. నిజాల్ని నిగ్గు తేల్చాల్సిందిగా చెబుతున్నారు. ఆరోపణలు వచ్చిన నేత పోలీస్ బాస్ అయినప్పుడు.. స్వేచ్ఛగా విచారణ జరిపే అవకాశం ఉంటుందా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/