Begin typing your search above and press return to search.
సీఎం మార్పు ఖరారైంది
By: Tupaki Desk | 14 Nov 2015 6:52 AM GMTసంకీర్ణ సర్కారులో రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. నాయకులకు పదవి నచ్చకున్నా లేదా కొత్త ఆలోచనలు వచ్చినా....ఒకవేళ సదరు నేతలపై ఆరోపణలు వచ్చినా... ఇలా కారణం ఏదైనా కావచ్చు కానీ సీటు మారిపోతుంది. ఇపుడు ఇదే సీన్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోంది. అయితే ఆ మార్పు మంచికోసమేనా? కారణం సరైనదేనా అంటే కాలమే సమాధానం చెప్పాలేమో.
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రిగా తన కుమార్తె ముఫ్తీ మెహబూబాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సంకీర్ణ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ సూచన ప్రాయంగా తెలిపారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు అయిన ముఫ్తి మెహబూబాకు జమ్మూ కాశ్మీర్ సీఎంగా బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరిగిన మాట వాస్తవమేననీ అంగీకరించారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని అప్పగించేందుకు మరి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు అంటున్నాయి.
పీడీపీ తుది నిర్ణయం విషయంలో బీజేపీ నిర్ణయం కీలకమని భావిస్తున్నారు. బీజేపీ-పీడీపీలు కలిసే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ తన బిడ్డకు పగ్గాలు అప్పగించడంపై నిర్ణయం తీసుకున్నప్పటికీ...తుది నిర్ణయంలో కమలనాథుల పాత్ర తప్పనిసరి అని సమాచారం.