Begin typing your search above and press return to search.
కాశ్శీర్ కు ఇక.. ఆమే ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 24 March 2016 1:35 PM GMTమరో చారిత్రక ఘట్టం చోటు చేసుకోనుంది. జమ్మూకాశ్శీర్ కు తొలిసారి ఒక మహిళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. పీడీపీ అధినేత్రి మెహబూబా జమ్మూకాశ్శీర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం లాంఛనమేనని చెబుతున్నారు.
ఢిల్లీలో ప్రధాని మోడీతో చర్చల నేపథ్యంలో.. ఆమె సీఎం కానున్నారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఆమె తండ్రి ఇటీవల మరణించటం.. దీంతో.. కొద్దికాలంగా జమ్మూకాశ్శీర్ ముఖ్యమంత్రి పదవి మీద కొంత అస్పష్టత నెలకొంది. అయితే.. బీజేపీ.. పీడీపీల మధ్య తాజాగా జరిగిన చర్చల నేపథ్యంలో ముఫ్తీని సీఎంగా చేసేందుకు ఓకే చేయటం.. ఇందుకు బీజేపీ కోరిన అంశాల పట్ల ఆమె సానుకూలంగా స్పందిస్తానన్న హామీతో తాజాగా జమ్మూకాశ్శీర్ లో బీజేపీ.. పీడీపీ మిత్రపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. జమ్మూకాశ్శీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ముఫ్తీ మెహబూబా చరిత్రపుటల్లో ఎక్కటం ఖాయమనే చెప్పాలి.