Begin typing your search above and press return to search.
బాండ్లపై సంతకాలపై మోడీ పాత మిత్రుడు ఎంతలా కస్సుమన్నారంటే?
By: Tupaki Desk | 11 Oct 2019 7:33 AM GMTఆర్టికల్ 370 నిర్వీర్యం నిర్ణయంతో సంచలనంగా మారిన మోడీ సర్కారు.. కశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల రాజకీయ నేతల్ని నిర్బంధం నుంచి ఇప్పుడిప్పుడే విడుదల చేస్తోంది. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా వారిని నిర్భందంగా హౌస్ లలో ఉంచేశారు. తాజాగా వారిని విడుదల చేస్తున్నారు. అయితే.. ఇందుకో కండిషన్ పెడుతున్నారు.
విడుదలయ్యే నేతలు ముందస్తుగా బాండ్ల మీద సంతకాలు పెట్టాలన్న కండీషన్లు పెడుతున్నారు. దీనిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఎన్డీయే సర్కారుతో స్నేహం చేసిన నాటి మిత్రపక్ష అధినేత కమ్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిర్భందంలో ఉన్న కశ్మీరీ నేతల్ని నిర్బంధంలోకి తీసుకోవటమే చట్టవిరుద్ధమైనప్పుడు వారిని షరతులతో ఎలా ముడిపెడతారని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు రాజకీయ నేతల్ని బాండ్లపై సంతకాలు పెట్టించుకొని విడుదల చేసినట్లుగా వస్తున్న వార్తలపై మొహబూబా తీవ్రంగా స్పందించారు.
నిర్బంధం నుంచి విడుదలైన వారితో బాండ్లపైన సంతకాలు చేయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారి నిర్బంధమే చట్టవిరుద్ధమైనప్పుడు.. ఏ చట్టం కింద వారిని షరతులతో విడుదల చేస్తారు? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. బాండ్లపై మొహబూబాతో సహా పలువురు నేతలు తప్పు పట్టారు. సంతకాలు చేసేందుకు నో చెప్పారు. ఒకప్పుడు మోడీ సర్కారు మిత్రపక్షంగా ఉన్న మొహబూబానే ఇంత ఆగ్రహంతో ఉంటే.. మిగిలిన రాజకీయపక్షాల నేతలు మరెంత ఆగ్రహంతో ఉంటారో ఈ ఉదంతం చూస్తే.. అర్థమవుతుందంటున్నారు.