Begin typing your search above and press return to search.

దేశంలో మరో మహిళా సీఎం

By:  Tupaki Desk   |   4 April 2016 9:37 AM GMT
దేశంలో మరో మహిళా సీఎం
X
దేశంలో మరో మహిళా సీఎం పాలనపగ్గాలు చేపట్టారు. జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణం చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎన్‌ ఎన్‌ వోహ్రా ముఫ్తీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. జమ్మూ కాశ్మీర్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. మెహబూబా తండ్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ ఇటీవల సీఎంగా ఉంటూనే చనిపోయిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంతో రోజుల తరబడి తీవ్ర వేదనలో కూరుకుపోయిన మెహబూబా ఆ తర్వాత బయటకు వచ్చినా, వెనువెంటనే సీఎం పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. మిత్రపక్షం బీజేపీ విడతలవారీగా జరిపిన చర్చలతో మొహబూబా ఎట్టకేలకు సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం మేరకు కొద్దిసేపటి క్రితం ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. దీంతో ఆ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తొలి మహిళా నేతగా మొహబూబా రికార్డులకెక్కారు.

కాగా మెహబూబా ప్రమాణ స్వీకారంతో దేశంలో మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నలుగురు సీఎంలు ఉన్నారు. గుజరాత్ లో ఆనంది బెన్ పటేల్.. రాజస్థాన్ లో వసుంధర రాజె - తమిళనాడులో జయలలిత - పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ ఉన్నారు. వీరిలో జయ - మమతలు ప్రస్తుతం ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్నికల్లోనూ విజయం వారిదేనని సర్వేలు చెబుతుండడంతో వారి స్థానాలకు ఢోకా లేదనే అనుకోవాలి. దీంతో మెహబూబా ప్రస్తుతం దేశంలో అయిదో మహిళా సీఎంగా చెప్పాలి.