Begin typing your search above and press return to search.

సీఎంగా ఆమె ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   1 April 2016 7:29 AM GMT
సీఎంగా ఆమె ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్
X
జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వం కొలువు తీరనుంది. ఆ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాని నేపథ్యంలో.. పీడీపీ.. బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయిద్ అనారోగ్యంతో కన్నుమూయటం.. అనంతరం రెండు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయాంశాలతో గవర్నర్ పాలనను విధించారు.

కొద్దిరోజులక్రితం ఇరు పార్టీల మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందంతో ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జమ్మూకాశ్మీర్  సీఎంగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టటం ఇదే తొలిసారి. సీఎంగా మెహబూబా ప్రమాణస్వీకారానికి ముహుర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల నాలుగున ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరో విశేషం ఏమిటంటే.. దేశంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రెండో ముస్లిం మహిళగా మెహబూబా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. మరి.. మెహబూబాతో కలసి బీజేపీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.