Begin typing your search above and press return to search.
కరోనా పై పోరుకు ‘మేఘా’ సైతం..
By: Tupaki Desk | 27 March 2020 10:20 AM GMTదేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై పోరుకు ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మేఘా ముందుకొచ్చింది. రెండు తెలుగురాష్ట్రాలకు చేయూతనందించింది. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వాల పోరులో మేఘా తనూ ఒక భాగస్వామిగా మారింది.
సామాజిక బాధ్యత లో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘా అధినేత పీవీ కృష్ణారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేశారు.
శుక్రవారం తాడేపల్లి లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు.
ఇక మేఘా సాయం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా 2 కోట్ల రూపాయలు మేఘ ఇంజనీరింగ్ విరాళం అందజేసింది. మేఘ ఇంజనీరింగ్ కర్ణాటక రీజియన్ విభాగం అధిపతి సుధీర్ మోహన్ కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కు అందించారు. ఇదే క్రమంలో ఒడిశా ప్రభుత్వానికి మరో కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందించింది మేఘ ఇంజనీరింగ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేఘా సంస్థ ప్రతినిధి రంగరాజన్ కలిసి కోటి రూపాయల చెక్కు అందచేసేరు.
త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం అందజేసేందుకు MEIL కంపెనీ సిద్దం అవుతోంది. ఇలా దేశవ్యాప్తంగా కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు తనవంతుగా సాయం అందజేస్తూ పారిశ్రామిక ప్రగతిలోనే కాదు.. సామాజిక బాధ్యతలోనూ తనవంతు పాత్రను మేఘా పోషిస్తోంది.