Begin typing your search above and press return to search.

దాతృత్వంలో 'మేఘా’మహోన్నతం

By:  Tupaki Desk   |   24 Oct 2019 6:12 AM GMT
దాతృత్వంలో మేఘా’మహోన్నతం
X
పల్లేలే దేశానికి పట్టుగొమ్ములు.. ఆ పల్లెల్ని మేఘా ఇంజనీరింగ్‌ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజనీరింగ్‌ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కింద పలు గ్రామాలను దత్తత తీసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. అలాగే ఆకలితో అలమటించే అన్నార్థులకు పట్టెడన్నం పెట్టి వారి కడుపునింపుతోంది. ఎంఈఐల్‌ గ్రామాలను దత్తత తీసుకొని మౌళికవసతులు కల్పించి అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నది. తాగునీరు, విద్యుత్‌, రహదారులు, వైద్యం మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ బారిన పడినవారికి తన శక్తిమేర సహాయం చేస్తున్నది. అలాగే మార్కెట్‌ యార్డుల్లో కానకష్టం చేసే నీరుపేద కూలీలకు మాధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తోంది. ప్రతీ ఏటా దాదాపు 10 లక్షల మంది ఆకలిని భోజనామృత ద్వారా తీరుస్తున్నది మేఘా ఇంజనీరింగ్‌. గ్రామాలను దత్తత తీసుకోవడం అంటే సంవత్సరానికి ఒకసారి చూసి వచ్చేవారిలా కాకుండా గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో ఎంఈఐల్‌ గ్రామ వికాసానికి తోడ్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధివైపు నడుపిస్తున్నది.

ఆదర్శంగా దత్తత గ్రామాలు...

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్‌లోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకొని రహదారులు, సౌర విద్యుత్‌ దీపాలతో పాటు 250 ఇళ్లల్లో మరుగదొడ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను ఎంఈఐల్‌ ఏర్పాటు చేసింది. 5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ కేంద్రాన్ని మురహరిదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేశారు. దీనివలన గ్రామంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుంది.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో జములపల్లిని దత్తత తీసుకున్న మేఘా ఇంజనీరింగ్‌ గ్రామంలోని 40, 20 వే కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులను ఆధీనీకరించింది. అలాగే గ్రామంలోని ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తోంది. ఈ పథకంలో ఫెరల్‌ అనే అత్యాధునిక టెక్నాలజీని వినియోగిందింది. దీని ద్వారా ప్రతీ ఇంటికీ ఒకే ప్రెషర్‌తో తాగునీరు సరఫరా అవుతుంది. జములపల్లిలో 12 కేవీ సోలార్‌ ప్లాంట్‌తోపాటు రెండు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

కృష్ణాజిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తోంది. డోకిపర్రు గ్రామంలో కళ్యాణమండపం, దేవాలయం నిర్మించింది. వీధుల్లో సోలార్‌ దీపాలతోపాటు రహదారులను కూడా ఏర్పాటు చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దింది మేఘా ఇంజనీరింగ్‌. అలాగే డోకిపర్రును తొలి పీఎన్జీ గ్రామంగా తీర్చిదిద్దింది ఎంఇఐఎల్‌. డోకిపర్రులో ఇంటింటికి పైపుడ్‌గ్యాస్‌ సదుపాయాన్ని ఎంఇఐఎల్‌ కల్పించింది. ఇది చాలా సురక్షితమైనది.

రాయలసీమ ప్రాంతాంలో నాగళాపురం, గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బేంచీలు, డెస్కులను కల్పించారు. గ్రామాల్లో కళ్యాణ మండపాలు నిర్మించడంతోపాటు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కులను కూడా ఏర్పాటు చేసింది.

అత్యధునిక సదుపాయాలతో నిమ్స్‌లో క్యాన్సర్‌ వార్డు

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించడం కోసం హైదరాబాద్‌లోని నిజాం ఆసుపత్రిలో ఎంఇఐఎల్‌ 5 కోట్ల వ్యయంతో కార్పోరేటు ఆస్పిటల్‌కు దీటుగా అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ భవనాన్ని నిర్మించింది మేఘా ఇంజనీరింగ్‌. ఇందులో డాక్టర్‌, నర్సులకు వార్డు, ఎమర్జెన్సీ వార్డు, లుయకేమియా వార్డు, మహిళలు, పురుషులకు వార్డుతో పాటు పిల్లలకు కూడా ప్రత్యేక వార్డును నిర్మించి ఇచ్చింది ఎంఇఐఎల్‌. అలాగే ఐసీయూ, బెడ్లు, ఆక్సీజన్‌ సదుపాయాలు, సెంట్రలైజ్డ్‌ ఏసీ సదుపాయం, రోగులకోసం బెడ్‌లిఫ్ట్‌ను సరఫరా చేసింది.

నిరుపేదల ఆకలి తీరుస్తున్న భోజనామృత

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో వాటి వారి సహాయకులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో ఎంఇఐఎల్‌ భోజనామృత కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబద్‌లోని నీలోఫర్‌ చిన్నపిల్లల ఆసుపత్రితో పాటు ఉస్మానియా హాస్పిటల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నది. అలాగే నిజమాబాద్‌, భోదన్‌ ప్రభుత్వ ఆస్పపత్రుల్లోని వారికి భోజన సదుపయాన్ని ఏర్పాటు చేసింది.

ప్రాణాంతక వ్యాదులతో బాధపడుతున్న ప్రాణం ఫౌండేషన్‌కు చెందిన చిన్నారులకు ఎంఇఐఎల్‌ వైద్యసదుపాయాన్ని కల్పిస్తున్నది. అలాగే నాణ్యమైన పౌష్టికాహారాన్ని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో కల్పిస్తోంది. వరంగల్‌ జిల్లాలోని హెచ్‌ఐవీ బాధిత చిన్నారులకు భోజనంతో పాటు ఇతర సహాయ సదుపాయాలను ఎంఇఐఎల్‌ కల్పించింది. సిద్ధిపేట, గజ్వేల్‌, వంటిమామిడి మార్కెట్‌యార్డులో రైతులకు, హమాలీలకు భోజనాలను మేఘా ఇంజనీరింగి ఏర్పాటు చేసి వారి ఆకలిని తీరుస్తున్నది.