Begin typing your search above and press return to search.
‘‘వరంగల్’’ సీన్లోకి వచ్చిన మీరాకుమార్
By: Tupaki Desk | 29 July 2015 4:53 AM GMTవరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో భాగస్వామ్యం అయిన తర్వాత.. తన ఎంపీ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే వీలుంది. ఈ నేపథ్యంలో.. ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ భావిస్తోంది.
ఇందుకోసం తెలంగాణ బిల్లును ఆమోదించేలా చేయటంలో తీవ్రంగా కృషి చేసిన నాటి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ పేరును తెరపైకి తీసుకురావటం తెలిసిందే. మీరాకుమార్ కానీ రంగంలోకి దిగితే.. సెంటిమెంట్ తో పాటు.. తెలంగాణ బిల్లు పాస్ కావటానికి తీవ్రంగా శ్రమించారన్న విధేయత తెలంగాణ ప్రజలు ప్రదర్శిస్తారని.. విజయం పక్కా అన్న వాదన వినిపించింది.
అయితే.. ఈ వాదనలో పస లేదని.. ఆమె పోటీకి సిద్ధంగా లేరని.. వరంగల్ బరిలో ఆమె రారన్న మాట వినిపించింది. తాజాగా.. మీరాకుమార్ పేరును ప్రస్తావించటమే కాదు.. ఆమెనే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొనాలని చెబుతూ.. వరంగల్ స్థానిక నేతలు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నేతలను అభ్యర్థించటం గమనార్హం.
తాజాగా గాంధీభవన్ కు వచ్చిన కాంగ్రెస్ నేతలు.. మీరాకుమార్ కానీ వరంగల్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా మారితే.. బలమైన పోటీ ఇవ్వటంతోపాటు.. సెంటిమెంట్ కూడా వర్క్ వుట్ అవుతుందని చెబుతున్నారు. మరి.. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదనకు మీరాకుమార్ ఓకే చెబుతారా?