Begin typing your search above and press return to search.
స్మార్ట్ ఫోన్ రూపాయికే..
By: Tupaki Desk | 17 Dec 2015 12:29 PM GMTఒక మోస్తరు ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా కూడా రూ.5 వేలకు తక్కువకు దొరకదు. కానీ, రూపాయికే బ్రహ్మాండమైన స్మార్ట్ ఫోన్ అమ్ముతామంటోంది చైనాకు చెందిన సంస్థ ఒకటి. అవును... నిజమే, అయితే, దీనికో ట్విస్టుంది. ఆ సంస్థ పెడుతున్న చిన్న కాంపిటీషన్ లో పాల్గొని సక్సెస్ అయితేనే రూపాయికే ఫోన్ ఇస్తారు. లేదంటే దాని ధర రూ.6,999.
చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మిజు.. ఎం2 పేరుతో కొత్త ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,999. స్నాప్ డీల్ లో దీన్ని విక్రయానికి పెట్టారు. ఐతే ఒక రూపాయికే ఈ ఫోన్ ని పొందే అవకాశాన్ని కల్పిస్తోందీ సంస్థ. ''రూ.1 కే ఎం2'' అంటూ ఓ ఆన్ లైన్ కాంటెస్ట్ ని సైతం ప్రకటించింది. దీనికి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే. మిజు లోగో ఫోన్ పై ఎక్కడ వేయాలి... ఆ లోగో ఎలా ఉండాలి అనేది వారికి సూచిస్తూ ఒక బొమ్మగీసి పంపించాలి. పంపించడం కూడా చాలా ఈజీ.. ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్ బుక్ పేజీలో #?M2FOR1 హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చెయ్యాలి. ఈ నెల 21 వరకే ఈ అవకాశం ఉంది. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేసి వాళ్లందరికీ రూపాయికే ఎం2 ఫోన్ ని ఇస్తారు. ఈ పోటీలు గీటీలు మనకు సరిపడవు అనుకున్నవారు రూ.6,999 చెల్లిస్తే స్నాప్ డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మిజు ఎం2 ప్రత్యేకతలు ఇవీ..
- ఐఫోన్ 5సిని పోలిన పాలీకార్బనేట్ యూనిబాడీ దీని ప్రత్యేకత
- 5 ఇంచ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 720X1280 పిక్సెళ్ల స్క్రీన్ రిజల్యూషన్
- డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్
- 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఓఎస్
- 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
- 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- 2500 ఎంఏహెచ్ బ్యాటరీ