Begin typing your search above and press return to search.

మేక‌పాటి మ‌ర‌ణం.. మినిట్ టు మినిట్‌.. ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   21 Feb 2022 5:32 PM GMT
మేక‌పాటి మ‌ర‌ణం.. మినిట్ టు మినిట్‌.. ఏం జ‌రిగింది?
X
రాష్ట్ర యువ మంత్రి, వివాదర‌హిత మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ క్ర‌మంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి ఆయ‌న మ‌ర‌ణ వార్త ప్ర‌క‌టించ‌డానికి మ‌ధ్య అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు..క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని ఆయ‌న కుటుంబ‌మే మీడియాకు వెల్ల‌డించింది... ఆ వివ‌రాలు.. ఇవీ..

ఉదయం 6 : రోజాలాగే నిద్రలేచారు మంత్రి గౌతమ్ రెడ్డి.
6:30 గంటలు: దైనందిన కార్యక్రమాలు, షెడ్యూల్స్ కు సంబంధించిన వివరాలను ఫోన్లో చక్కబెట్టారు.
7 గంటలు: ఏదో ఆలోచిస్తూ నివాసంలోని రెండో అంతస్థులో సోఫాలో కూర్చుని ఉన్నారు.
7.12: శరీరంలో అప్పటి వరకూ పరిస్థితి ఎలా ఉందో తెలియదుగానీ.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంటమనిషికి చెప్పారు.
7.15 : గుండెల్లో నొప్పిగా ఉందంటూ.. సోఫాలో తల్లడిల్లిపోవడం ప్రారంభించారు.
7.16 : మేకపాటి సతీమణి శ్రీకీర్తి.. పరిగెత్తుకొచ్చారు. అంతా అయోమయం.. ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. మెల్లగా సోఫా నుంచి నేలమీదకు మంత్రి జారిపోయారు. మంత్రి మేకపాటిని.. బిగ్గరగా అరుస్తూ పరిగెత్తుకెళ్లి పట్టుకున్నారు భార్య శ్రీకీర్తి.
7:18: డ్రైవర్ నాగేశ్వరరావు పరిగెత్తుకొచ్చి, తనకు తెలిసిన రీతిలో మంత్రిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఛాతిమీద నొక్కుతూ(సీపీఆర్) మంత్రికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
7:20: గుండెల్లో నొప్పితో తల్లడిల్లిపోతున్న మంత్రి మేకపాటి.. "నొప్పి పెడుతుంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" అన్నారు సరిగా గొంతు పెగలకుండానే! మంత్రి వ్యక్తిగత సిబ్బంది వేగంగా మంచినీళ్లు తెచ్చారు. కానీ.. వాటిని తాగలేకపోయారు. ఇక, లాభంలేదు. పరిస్థితి మరింత తీవ్రమవుతోందని భార్య కీర్తికి అర్థమైపోయింది. వెనువెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
7:22: మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆసుపత్రికి బయలుదేరారు. కారులో అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అలోపో ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సా విభాగంలోకి మంత్రిని తరలించారు.
8:15: నాడీ పనితీరు బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
8.16: ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది.
9:13: మంత్రి మేకపాటి లేరని అపోలో వైద్యులు నిర్ధరించారు
9:15: అధికారిక ప్రకటన విడుద‌ల‌.