Begin typing your search above and press return to search.

మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డికి జిమ్ అంటే ప్రాణం.. ఇదిగో వీడియో!

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:49 PM GMT
మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డికి జిమ్ అంటే ప్రాణం.. ఇదిగో వీడియో!
X
ఏపీ అధికార వైసీపీ యువ‌ నాయకుడు, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రా లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 50 ఏళ్ల ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు.

ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అపోలో ఆసుపత్రి అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఎందో ద్రుఢంగా.. ఆజాను బాహుడిగా, కండ‌లు తిరిగిన భుజాల‌తో ఆయ‌న ఆక‌ర్ష‌ణీయంగా ఉండేవారు. దీనికి కార‌ణం.. ఆయ‌న‌కు ఫిట్‌నెస్‌పై ఉన్న మ‌క్కువే కార‌ణం.

గౌతమ్ రెడ్డి స‌హ‌జంగా ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తి. ఎంత బిజీగా ఉన్నా ఆయ‌న వ‌ర్క‌వుట్స్ చేయ‌కుండా మాత్రం ఉండ‌రు. దినచర్య లో భాగంగా ఉదయం 7.30 గంటలకు ఆయ‌న ఎక్క‌డ ఉన్నా క‌స‌ర‌త్తులు చేయాల్సిందే. ఈ క్ర‌మంలో ఆయ‌నకు నెల్లూరులోని సొంత ఇంట్లోను, అక్క‌డి క్యాంపు కార్యాల‌యంలోనూ.. అమ‌రావ‌తిలోని మంత్రి ఆఫీస్‌లోను, హైద‌రాబాద్‌లోని సొంత నివాసంలోనూ ప్ర‌త్యేక అధునాత జిమ్‌ల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో ఆయ‌న‌కు విదేశీ ట్రైన‌ర్ కూడా ఉన్నారు.

ముఖ్యంగా భుజాల బ‌లోపేతానికి చేసే ఎక్స్‌సైజ్‌ను ఆయ‌న ఖ‌చ్చితంగా చేసేవారు. తాజాగా ఆయ‌న ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గౌతమ్ వంటి ఫిట్‌నెస్ ఫ్రీక్, తన జిమ్ సెషన్‌లను ఎప్పుడూ కోల్పోలేదు. ఆయ‌న దేహ‌దారుఢ్యం చూస్తే.. క‌స‌ర‌త్తులతో దేహాన్ని బ‌లోపేతం చేసుకున్న‌ట్టు స్ప‌సష్టంగా తెలుస్తోంది. ఫిట్‌నెస్ కోసం చాలా సేపు క‌స‌ర‌త్తులు చేయ‌డం దైనందిన చ‌ర్య‌లో భాగంగా మార్చుకున్నార‌ని కుటుంబ స‌భ్యులు కూడా తెలిపారు. నిజానికి మంత్రి అయ్యాక‌.. ఒక్కొక్కసారి ఉద‌యాన్నే కార్య‌క్ర‌మాలు ఉంటే వెళ్లిపోయేవారు.

కానీ, రాత్రి ప‌డుకునే ముందు అయినా.. స‌రే.. ఆయ‌న ఖ‌చ్చితంగా ఎక్స‌ర్‌సైజులు చేయాల్సిందే. ఇంత‌లా ఆయ‌న బాడీ ఫిట్‌నెస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇనుప కండ‌లు, ఉక్కు న‌రాలు.. అన్న‌ట్టుగా ఆయ‌న దేహం ద్రుఢంగా ఉండేందుకు వివిధ క‌స‌ర‌త్తులు చేసేవారు. అందుకే 50 ఏళ్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయ‌న 35-40 మ‌ధ్య వ‌య‌సున్న యువ‌కుడిగానే క‌నిపించేవారు. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోలో ఆయ‌న స‌మ‌యం పెట్టుకుని మ‌రీ ఎక్స‌ర్ సైజులు చేస్తున్న దృశ్యం మ‌న‌కు క‌నిపిస్తోంది. దీనిని చూసిన నెటిజ‌న్లు ఆయ‌న‌లోని ఫిట్‌నెస్ త‌ప‌న‌ను చూసి ఆశ్చ‌ర్య పోరుతున్నారు.