Begin typing your search above and press return to search.
మద్దతు కూడగడతానన్న పవన్ ఎక్కడ?
By: Tupaki Desk | 14 March 2018 8:57 AM GMTమీరు పార్లమెంటులో అవిశ్వాసం పెట్టండి. నేను మీకు అండగా ఉంటా. ఢిల్లీకి వస్తా. పార్టీలను కలుస్తా.. మద్దతు కూడగడతా.. అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గడిచిన కొద్దిరోజులుగా ఆ మాట మీద మాట్లాడటమే మానేశారు. ఈ రోజు సాయంత్రం గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవిశ్వాసానికి మద్దతుగా పార్టీలను ఒకేతాటి మీదకు తీసుకొస్తానన్న ఆయన.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రత్యేక హోదా మీద మొదట్నించి ఒకే రీతిలో పోరాటం చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని ఆయన చెప్పారు. హోదాపై పలుమార్లు పోరాడిన చరిత్ర తమదేనని చెప్పిన ఆయన.. పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద విధానంతో ఏపీ భారీగా నష్టపోయిందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంలో బాబుది కూడా కీలకపాత్ర ఉందన్నారు. బాబుకు ఎంతసేపు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల తాపత్రయమే తప్పించి.. ఏపీ ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచన లేదన్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు.
ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్న పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టనున్న అవిశ్వాసానికి అండగా నిలవాలన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేకపాటి మాటకు చంద్రబాబు.. పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.