Begin typing your search above and press return to search.

చంద్రబాబును ఇరుకునపెట్టిన మేకపాటి

By:  Tupaki Desk   |   8 Feb 2016 10:28 AM GMT
చంద్రబాబును ఇరుకునపెట్టిన మేకపాటి
X
వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న అంచనాతో టీడీపీలోకి ఇతర పార్టీల నుంచి నేతల చేరికున ప్రోత్సహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆశలపై మరోసారి ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఏపీలో మరో పదేళ్ల పాటు అసెంబ్లీ స్థానాల పెంపు అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈసీ ఈ విషయం చెప్పింది.

మేకపాటి సోమవారం ఎన్నికల సంఘం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మరో 50 మందిని అసెంబ్లీకి పంపుతామని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న ప్రచారంలో నిజాన్ని కనుగొనేందుకు ఎలక్షన్ కమిషన్ తో భేటి అయ్యానని.. 2026 వరకూ సీట్ల పెంపు కుదరదని అధికారులు తెలిపారని చెప్పారు. అటార్నీ జనరల్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని మేకపాటి తెలిపారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపెంచారు.

ఈ విషయంపై స్పష్టత కోసమే తాను ఢిల్లీలోని సీఈసీ నసీం జైదీతో భేటి అయ్యానని మేకపాటి చెప్పారు. 2026 వ సంవత్సరం వరకు నియోజకవర్గాల పెంపునకు అవకాశం లేదని అటార్నీ జనరల్ చెప్పినట్లు సీఈసీ వివరించినట్లు మేకపాటి పేర్కొన్నారు.