Begin typing your search above and press return to search.

గౌతం రెడ్డి భార్య పాలిటిక్స్ లోకి వస్తారా...విక్రం రెడ్డి ఏం చెప్పారు...?

By:  Tupaki Desk   |   15 Oct 2022 5:05 AM GMT
గౌతం రెడ్డి భార్య పాలిటిక్స్ లోకి వస్తారా...విక్రం రెడ్డి ఏం చెప్పారు...?
X
మేకపాటి ఫ్యామిలీకి నెల్లూరు రాజకీయాల్లో ఎంతో పేరు ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి మంత్రులు అయ్యారు. ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. సుదీర్ఘమైన రాజకీయ అనుబంధం వారిది. కాంగ్రెస్ కి వీర సైనికుడుగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి జగన్ లో కాబోయే సీఎం ని చూసి వైసీపీలో ఫస్ట్ చేరిన ఎంపీ. ఆ తరువాత పార్టీని విస్తరించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మేకపాటి పెద్ద కొడుకు గౌతం రెడ్డిని మంత్రిగా తీసుకున్నారు. కీలకమైన శాఖలు కట్టబెట్టారు. మూడేళ్ల పాటు దాదాపుగా ఆయన ఆ సక్సెస్ ఫుల్ గా పనిచేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించారు.

గౌతం రెడ్డి రాజకీయ వారసత్వం ఎవరికి దక్కుతుంది అంటే ఆయన సతీమణి శ్రీకీర్తిరెడ్డికి అని అంతా అనుకున్నారు. దాని మీదనే ప్రచారం జరిగింది. ఆమెను ముందుగా మంత్రిగా తీసుకుని ఆనక ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలోకి దింపుతారు అని కూడా అనుకున్నారు. కానీ జరిగినది వేరు. ఆ సీట్లోకి అనూహ్యంగా తమ్ముడు విక్రం రెడ్డి వచ్చారు. ఆయన పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఆయన ఎమ్మెల్యే అయి దాదాపుగా నాలుగు నెలలూ పై దాటుతోంది. లేటేస్ట్ గా యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రం రెడ్డిని పలు ప్రశ్నలు మీడియా సంధించింది. మీ వదిన గారిని సైడ్ చేసి ఎమ్మెల్యే అయ్యారా అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన తడుముకోకుండా ఇచ్చిన జవాబు అదేమీ కాదు అనే. తన అన్న రాజకీయ బాధ్యతలు తాను చూసుకుంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళ బాధ్యతను వదిన గారు చూసుకుంటారని, ఇదంతా కుటుంబంలో అంతా అనుకుని చేసినదే అని క్లారిటీగా చెప్పారు.

తన అన్న ఆశయాల సాధన కోసం ఎంజీయార్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశామని దానికి హెడ్ గా తన వదిన ఉంటున్నారని ఆయన వివరించి చెప్పారు. ఇక తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కోడలు రాజకీయాల్లోకి రావడం ఇస్ఠం లేదు అంటూ వస్తున్న వార్తలు కూడా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. తన వదినకు రాజకీయలు అంటే ఇష్టం లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇవన్నీ గాలి మాటలు తప్పుడు ప్రచారమేనని కూడా అన్నారు.

ఇక అన్ని కుటుంబాల మాదిరిగానే తమ కుటుంబంలో కూడా విభేదాలు చిన్న చిన్నవి ఉంటాయని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న బాబాయ్ చంద్రశేఖరెడ్డికి తన తండ్రికి ఉన్న విభేదాలు సర్దుమణిగితే మళ్లీ అంతా ఒక్కటిగా ఉంటామని చెప్పుకొచ్చారు. తన గెలుపు కోసం ఆత్మకూరులో బాబాయ్ పనిచేశారని ఆయన చెప్పారు. ఇక మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి అనారోగ్య కారణాల వల్లనే ఆత్మకూరు ప్రచారానికి రాలేదని చెప్పారు.

ఆయన కుమార్తె కైవల్యా రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదని, జగన్ వైసీపీ అన్న రెండు ఆయుధాలు తమకు చాలు అని విజయం తమదే అని ధీమాగా చెప్పారు. రాజకీయాల్లో తన అన్న వారసత్వం నిలబెడతాను అని ఆయన గట్టిగా చెప్పారు. అలాగే నెల్లూరు జీల్లాలోని సంగం బ్యారేజి సోంశిల ప్రాజెక్ట్ పరిశాలాను టూరిజం స్పాట్స్ గా చేస్తామని చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.