Begin typing your search above and press return to search.

అమెరికా ఫస్ట్ లేడీ నేను.. కాదు నేను!

By:  Tupaki Desk   |   10 Oct 2017 9:59 AM GMT
అమెరికా ఫస్ట్ లేడీ నేను.. కాదు నేను!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌క కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో సవతుల మధ్య పోరు నడుస్తోంది. ఫస్ట్ లేడీ నేనంటే కాదు నేనంటూ.. ట్రంప్ ఇద్దరు భార్యలు మాటల యుద్ధానికి దిగారు. ట్రంప్ మొదటి భార్యను నేనే కాబట్టి.. ఫస్ట్ లేడీని కూడా నేనే అంటూ ఇవానా చేసిన కామెంట్స్‌ తో గొడవ మొదలైంది. దీనికి మెలానియా ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ప్రపంచం దృష్టిలో పడటానికే ఆమె ఇలాంటి కామెంట్స చేస్తున్నారని మెలానియా ఆరోపించారు. దీంతో ట్రంప్ తాజా - మాజీ భార్య‌ల మ‌ధ్య ర‌చ్చ ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్రంప్ మొద‌టి భార్య ఇవానా తన తాజా పుస్తకం రైజింగ్ ట్రంప్ ప్రమోషన్‌ లో భాగంగా ఏబీసీ న్యూస్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్‌తో తనకున్న సంబంధంపై ఆమె సరదాగా కొన్ని జోకులు వేశారు. ``వైట్‌ హౌజ్ డైరెక్ట్ నంబర్ నా దగ్గర ఉంది. కానీ నేను ఫోన్ చేయను. అక్కడ మెలానియా ఉంటుంది. ఆమె ఈర్శ్యగా ఫీలవడం నాకు ఇష్టం లేదు. నేను ట్రంప్ మొదటి భార్యను. నేను ఫస్ట్ లేడీని`` అని ఇవానా అన్నారు. అయితే దీనిపై మెలానియా వెంటనే స్పందించలేదు. మెలానియా తరఫున ఆమె అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ``వాషింగ్టన్‌ లో ఉండటాన్ని, ఫస్ట్ లేడీగా ఆమె పాత్రను మెలానియా గౌరవంగా ఫీలవుతున్నారు. ఇలా బుక్స్ అమ్ముకోడానికి ఆమె ఫస్ట్ లేడీ పాత్రను వాడుకోవడం లేదు. ఇది కేవలం ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఇవానా చేసిన కామెంట్స్`` అని ఆ ప్రకటనలో ఘాటుగా రిప్లై ఇచ్చారు .

కాగా, ప్రస్తుతం వైట్‌ హౌజ్‌ లోనే ఉంటున్న ట్రంప్ ముగ్గురు పెద్ద పిల్లలు డొనాల్డ్ జూనియర్ - ఇవాంకా - ఎరిక్‌ లకు ఇవానా తల్లి. ట్రంప్‌ కు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో రెండో భార్య మార్లాకు జన్మించిన టిఫానీ ఒకరైతే - ప్రస్తుతం వైట్‌ హౌజ్‌ లో ఉంటున్న మెలానియాకు జన్మించిన బారన్ మరొకరు. ఇవానా 1979లో ట్రంప్‌ ను పెళ్లి చేసుకున్నారు. 1992లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లాను పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత వీళ్ల బంధానికి కూడా తెరపడింది. మెలానియా ట్రంప్‌ కు మూడో భార్య.