Begin typing your search above and press return to search.
మెలానియా గౌన్ ధర బయటకొచ్చింది
By: Tupaki Desk | 28 Jun 2017 5:51 AM GMTభారతప్రధాని నరేంద్ర మోడీ తన తాజా విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ కు వెళ్లిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా ధరించిన పసుపచ్చ గౌన్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది.
అధికారిక కార్యక్రమాల సందర్భంగా ఇంత ముదురురంగు.. బ్రైట్ కలర్ తో కూడిన డ్రెస్ ను వేసుకోవటం కనిపించదు. అత్యంత ప్రముఖులు అధికారిక కార్యక్రమాల సందర్భంగా చాలా అరుదుగా వేసుకునే వర్ణంతో ఉన్న గౌన్ ను ధరించిన మెలానియా మెరిసిపోయారు. అందరిలోకి చాలా స్పెషల్ గా కనిపించారు.
సహజంగానే అందగత్తె అయిన మెలానియా.. పసుపు వర్ణంతో కూడిన లాంగ్ ఫ్రాంక్ లో చాలా స్పెషల్ గా కనిపించారు. ఆమె డ్రెస్సు ఫోటోల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించింది. తన దుస్తుల ఎంపికలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే మెలానియా తాజా గౌన్ డీసెంట్ గా ఉండటంతో పాటు.. అట్రాక్టివ్ గా ఉండటం గమనార్హం. అందరి కంట్లో పడిన ఈ గౌన్ ఖరీదు అక్షరాల రూ.ఒక లక్ష 40 వేలుగా చెబుతున్నారు. వేలాది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న ట్రంప్ సతీమణి డ్రెస్ ఈ మాత్రం ఖరీదు ఉండటం పెద్ద విషయం కాదనే చెప్పాలి. కానీ ఆమె ఖరీదు మోడీ వేసుకునే కోటు కంటే ఎక్కువేం కాదని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు అది వేరే విషయం!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/