Begin typing your search above and press return to search.
ట్రంప్ మాటలే ఆయన పెళ్లాం నోటి వెంట వస్తే..
By: Tupaki Desk | 5 April 2016 6:31 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని తపిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కంపు మాటల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అపర కుబేరుడి మాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను చేస్తున్న వ్యాఖ్యల కారణంగా పెరిగిపోతున్న విమర్శల్ని తగ్గించుకునేందుకు వీలుగా తాజాగా ఆయన తన మూడో భార్య లానియాను రంగంలోకి దించటం తెలిసిందే.
సొంత పార్టీ నేతలే తన అభ్యర్థిత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తన్న వేళ.. థన మీదున్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి ఆయన తన భార్యను ప్రచారంలోకి దింపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరగనున్న విస్కాన్సిన్ ప్రైమరీలో ట్రంప్ ఓటమి పక్కా అని సర్వేలు తేలుస్తున్న వేళ.. తన భార్యను రంగంలోకి దించటం ద్వారా అధ్యక్ష స్థానానికి తన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఆశల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా తన భార్యను ప్రచారంలోకి తెస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రచారానికి దిగిన ట్రంప్ సతీమణి మిలానియా ఏం మాట్లాడారు? ఆమె వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? భర్త మాదిరే ఘాటుగా.. వివాదాస్పదంగా ఉన్నాయా? లేక.. అందుకు భిన్నంగా ఉన్నాయా? అన్న విషయాల్ని చూస్తే.. కాస్తంత ఆసక్తికర సంగతులే చెప్పాల్సి వస్తుంది. తన భర్తకు అండగా నిలిచిన ఆమె.. ట్రంప్ నోట గతంలో వచ్చిన మాటల్ని తనలాగే నాజుగ్గా వివరించటమే కాదు.. తన భర్త చెప్పిన మాటల లోతుల్ని ఆమె జాగ్రత్తగా స్పృశించటం గమనార్హం.
మెక్సికన్లను తన భర్త అవహేళన చేసేలా మాట్లాడారన్న విమర్శను ప్రస్తావించిన ఆమె.. తాను అలా అనుకోవటం లేదని.. ఆక్రమంగా ప్రవేశిస్తూ.. ఆమెరికాలో ఆడగాలు చేస్తున్న వారి విషయంలోనే తన భర్త ప్రస్తావించారే తప్పించి మరొకటి కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమెరికాను రక్షించాలన్నదే తన భర్త లక్ష్యమని.. ఆయన కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా వికసిస్తుందంటూ తన వాణిని బలంగా వినిపించారు. అమ్మడు చెబుతున్న నాజూకు మాటలు ట్రంప్ మీద ఉన్న ఇమేజ్ ను మారుస్తాయా? ఆయన కష్టాల్ని గట్టెక్కాలా చేస్తాయా? అన్నది త్వరలో వెలువడే ఫలితాలు తేల్చనున్నాయి.