Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ లోని ఛీదరించుకునే యాంగిల్ చెప్పి షాకిచ్చిన మిలిందా

By:  Tupaki Desk   |   5 March 2022 3:29 AM GMT
బిల్ గేట్స్ లోని ఛీదరించుకునే యాంగిల్ చెప్పి షాకిచ్చిన మిలిందా
X
దూరం నుంచి చూసినప్పుడు అంతా బాగున్నట్లే అనిపిస్తుంటుంది. కానీ.. ఒకసారి లోతుల్లోకి వెళ్లటం షురూ చేసిన తర్వాత చాలానే విషయాలు బయటకు వస్తాయి. తన భర్త వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. అతడి ప్రవర్తన నచ్చని ఆమె తన ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టేసి బయటకు రావటం అంత తేలికైన విషయం కాదు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పే జంటగా పేరున్న బిల్ గేట్స్.. మిలిందాలకు సంబంధించి.. వారిద్దరూ విడిపోవటం.. విడాకులు తీసుకోవటం చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన ఈ వ్యవహారాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేనోళ్లు చాలామందే ఉంటారు. అన్యోన్యంగా ఉంటూ.. ప్రపంచ వ్యాప్తంగా తమ ఫౌండేషన్ ద్వారా బోలెడన్ని సేవా కార్యక్రమాల్నినిర్వహించే వారిద్దరూ విడిపోవటం చాలామందికి అస్సలు నచ్చలేదు. కానీ.. విడిపోవటం తప్పనిసరి అయ్యాక.. ఎవరి దారి వారిదన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

ఇంతకూ వీరిద్దరి విడాకులకు కారణం.. బిల్ గేట్స్ అనే చెప్పాలి. అతగాడి వ్యక్తిగత జీవితం.. కొందరి విషయంలో అతడికున్న సంబంధాలు ఏ మాత్రం మింగుడుపడేలా లేకపోవటం.. వాటి గురించి తెలుసుకున్న మిలిందా.. గేట్స్ తో విడిపోయేందుకు సిద్ధం కావటం.. తాను అనుకున్నది సాధించుకున్నారు. విడిపోయినప్పటికీ ధార్మిక కార్యక్రమాల్ని మాత్రం కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరి విడాకులు పెను సంచలనంగా మారటం.. దాని గురించి కోర్టులో కేసులు ఒక కొలిక్కి రావటం తెలిసిందే.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిలిందా ఓపెన్ అయ్యారు. కాకుంటే.. వివరాలు కొన్నింటికి క్లోజ్ చేసుకోవటానికి అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. పెళ్లైన ఇన్నాళ్లకు భర్తతో విడిపోవటానికి కారణాలు ఏమిటన్న విషయాల్ని చెబుతూనే.. కొన్ని ప్రశ్నలకు గేట్స్ నే అడగాలని పేర్కొన్నారు. ఇంతకూ ఆమె ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..

- విడాకుల వేళలో ఎన్నో ఏళ్లు నేల మీద పడుకొని బాధపడ్డా. నేల మీద పడుకొని ఏడ్చేశా. నా జీవితం మరో మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది. మేం విడిపోతున్నట్లు ప్రకటిస్తే చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతారు. కానీ.. ప్రపంచమంతా చర్చించేంత పెద్ద విషయం అవుతుందని ఊహించలేదు.

- విడాకుల బాధ నుంచి ఎలా బయటపడాలి? జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఇలా ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని. కొన్నిసార్లు విపరీతమైన కోపం వచ్చేది. ఇది నిజగానే చాలా బాధాకరమైన పరిణామం.

- నా జీవితంలో మరో పేజీని ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని భావించా. అదే సమయంలో బిల్ గేట్స్ కు సంబంధించిన డిటైల్స్ తెలిసి షాక్ తిన్నా. లైంగిక వేధింపుల కేసులో నేరస్తుడైన జెఫ్రీ ఎప్ స్టీన్ తో గేట్స్ సంబంధాల గురించి మాట్లాడారు.

- జెప్రీని కలవటం తనకు ఇష్టం లేదని.. ఒకసారి తాను వెళ్లి కలిసినట్లుగా చబుతున్నారు. ఎలాంటి వాడన్న విషయం గురించి అవగాహన కోసం నేను కూడా ఒకసారి వెళ్లి కలిశా. అనంతరం ఎందుకు కలిశానా? అన్న భావనకు కలిగింది. అతడెంతో అసహ్యకరమైన వ్యక్తిగా ఆమె పేర్కొన్నారు.

- జెఫ్రీతో సంబంధం.. విడాకులు తీసుకోవటానికి కారణమా? అని ప్రశ్నిస్తే.. ఇదొక్కటే కాదు చాలానే అంశాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఉద్యోగితో గేట్స్ సంబంధాలు గురించి అడిగినప్పుడు గంభీరంగా మారిన ఆమె.. ఈ వివాలన్నీ ఆయన్నే అడగాలని సూచించారు.

- ఒక కార్యక్రమం కోసం గేట్స్ దంపతులు ఎప్ స్టీన్ ను కలిశానని.. అతడి ప్రవర్తనతో తాను సౌకర్యవంతంగా లేదని గేట్స్ కు చెప్పా. కానీ.. నా మాటల్ని పట్టించుకోలేదు.

- అతని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే ఓ సారి అతన్ని కలిశాను. కలిసిన తరువాత అనిపించింది. నేను ఎప్‌స్టిన్‌ ఎందుకు కలిశానా' అని చింతించాను. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని, ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేసేది. మంచి వ్యక్తిత్వం కాదు.

- మేమిద్దరం విడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎప్ స్టీన్ లో కలిసి చాలా పెద్ద తప్పు చేశా.