Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్ కు షాక్ ఇవ్వడానికి మెలిందా రెడీ

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:30 AM GMT
బిల్ గేట్స్ కు షాక్ ఇవ్వడానికి మెలిందా రెడీ
X
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఆయన భార్య మెలిందా షాక్ ఇచ్చేలా ఉంది. ఇటీవలే బిల్ గేట్స్-మెలిందా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలు వివరించలేదు.

కానీ వీరి 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆసక్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్ కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్ బహిరంగంగానే ప్రకటించారు.తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తోందట..

ఈ క్రమంలోనే తమ ఇద్దరి సమష్టి ఆస్తి అయిన 130 బిలియన్ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట.. ఇందుకుగాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్ ట్రస్ట్.. ఎస్టేట్ లాయర్ ఉన్నారని డెయిలీ మెయిల్ కోట్ చేసింది.మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.