Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ పై ట్విట్టర్ లో పోటెత్తిన మీమ్ లు

By:  Tupaki Desk   |   28 Oct 2022 11:30 PM GMT
ఎలన్ మస్క్ పై ట్విట్టర్ లో పోటెత్తిన మీమ్ లు
X
ప్రపంచంలోనే దిగ్గజ సోషల్ మీడియా ట్విట్టర్ ను ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాడన్న వార్త సంచలనమైంది. ఆయన ట్విట్టర్ టేకోవర్ చేయగానే సీఈవో, సీఎఫ్.ఓ సహా ఉన్నతాధికారులను తొలగించి షాకిచ్చాడు. మన భారతీయ సీఈవో పరాగ్ అగర్వాల్ ను సైతం తొలగించాడు. దీంతో పాటు ట్విట్టర్ ఆఫీస్ లో ఒక సింక్ ను పట్టుకొని హల్ చల్ చేసిన వైనం వైరల్ అయ్యింది.

ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోగానే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు ఎలన్ మస్క్.. ట్విట్టర్ లీగల్ ,పాలసీ, ట్రస్ట్ హెడ్ విజయగద్దెతోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆపీస్ నెడ్ సెగల్, సీఈవో పరాగ్ అగర్వాల్, జనరల్ కౌన్సెల్ సియన్ ఎడ్గెట్ లను ఆయన తొలగించారు. వీరిని తొలగించగానే ట్విట్టర్ లో మీమ్ లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి.

పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ అమ్రిష్ పురి, గోవిందా లాంటి వారు నటించిన సినిమాల్లోని పిక్స్, వీడియోలు షేర్లు చేస్తూ 'ప్రభుత్వ ఉద్యోగం బెటర్.. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ట్విట్టర్ సీఈవోకే జాబ్ గ్యారెంటీ లేదు' అంటూ మీమ్స్ రూపొందించి వైరల్ చేశారు.

ఇక చైనా కాంగ్రెస్ లో పాత చైనా అధ్యక్షుడు హుజింటావోను తనకు దూరంగా తీసుకెళ్లమని చెప్పిన ప్రస్తుత అధ్యక్షుడి వీడియోకు ఎలన్ మస్క్, పరాగ్ తలకాయలు అంటించి మరీ కొందరు మీమ్స్ తయారు చేసి నవ్వులు పూయించారు.

ట్విట్టర్ సీఈవోగా తొలగించిన పరాగ్ అగర్వాల్ ఇక 'స్వీట్స్ అండ్ స్నాక్స్ అనే షాప్ పెట్టుకుంటే బెటర్ అని ఓ నెటిజన్ మీమ్స్ తో జోక్ చేశారు.

బాలీవుడ్ హీరో గోవిందా కామెడీ సీన్ ను పోస్ట్ చేసి ఓ సినిమాలో కంపెనీలోని అధికారులందరినీ ఆయన తొలగించే సీన్ ను ఎలన్ మస్క్ గా పోల్చి కొందరు మీమ్ తయారు చేసి ఎద్దేవా చేశారు.

హాలీవుడ్ అవేంజర్స్ మూవీలోని విలన్ థానోస్ గెటప్ లో మస్క్ ను పెట్టి చిటకేసి ట్విట్టర్ లోని అందరని తీసేశాడన్న మీమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా ఎలన్ మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకోగానే చేసిన పనికి సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. చాలా మంది మస్క్ తీరును తప్పుపడుతూ చేసిన మీమ్స్ నవ్వులు పూయించాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.