Begin typing your search above and press return to search.
సచిన్ కూతురు గురించి గూగుల్ లో తప్పుడు సమాచారం
By: Tupaki Desk | 16 Oct 2020 12:30 AM GMTకనీస ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది గూగుల్. ఏ చిన్న విషయం పెద్ద విషయం కావాలన్నా కూడా గూగుల్ చేస్తూ ఉంటారు. గూగుల్ లో ఎలా అడిగానా ఏం అడిగినా కూడా ఏదో ఒక సమాచారం అయితే వస్తూనే ఉంటుంది. అయితే గూగుల్ లో వచ్చేది అంతా నిజమే అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే గూగుల్ ను తప్పుదారి పట్టించేందుకు కొందరు తప్పుడు సమాచారంను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే గూగుల్ ఆ విషయాలను విశ్లేషించక పోవడం వల్ల అప్పుడప్పుడు బ్లండర్ మిస్టేక్స్ సమాచారంను ఇస్తూ ఉంటుంది.
కొన్ని రోజుల క్రితం రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అంటూ వచ్చింది. ఆ విషయం గురించి ఇంకా మర్చిపోకుండానే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి కూడా తప్పుడు సమాచారంను గూగుల్ ఇస్తుంది. సారాకు ఇంకా పెళ్లి కాలేదు. అయినా కూడా ఆమె భర్త ఎవరు అంటూ గూగుల్ ను అడిగితే శుభ్ మన్ గిల్ అంటూ సమాధానం ఇస్తుంది. గత కొన్నాళ్లుగా శుభ్ మన్ గిల్ తో సారా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ విషయాలను ఇప్పటి వరకు వారు క్లారిటీ ఇవ్వలేదు. వారు ఇంకా చాలా చిన్న పిల్లలే.
పెళ్లి వయసు రావాలంటే కనీసం అయిదు ఆరు ఏళ్లు అయినా పడుతుంది. కనుక అప్పటి వరకు ఎవరు ఏంటో అనేది తెలియదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గూగుల్ వారిద్దరిని ఏకంగా భార్య భర్తలు అంటూ తప్పుడు సమాచారం ఇవ్వడంతో గూగుల్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గూగుల్ కు వయసు అయిపోయినట్లుంది. తప్పుడు సమాచారం ఇస్తుంది. గూగుల్ కు ప్రత్యామ్నాయం వెదికే టైం వచ్చినట్లుందంటూ నెటిజ్స్ కొందరు మీమ్స్ చేస్తున్నారు.