Begin typing your search above and press return to search.
వృద్ధులను కరోనా నుంచి కాపాడుకోవచ్చు.. బీసీజీ టీకాతో సాధ్యం
By: Tupaki Desk | 1 Nov 2020 12:30 AM GMTకరోనా వ్యాక్సిన్, చికిత్స కోసం శాస్త్రవేత్తలు అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. ఈ పరిశోధనల్లో వారికి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. బీసీజీ టీకా వేసి వృద్ధులను కరోనా నుంచి కాపాడవచ్చని సైంటిస్టులు కనిపెట్టారు. కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్న భారత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. బీసీజీ టీకా తీసుకున్న వృద్ధుల్లో మెమెరీ సెల్ ప్రతిస్పందించాయి. దీంతోపాటు యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ధ్రువీకరించింది. గత జులై నుంచి సెప్టెంబరు మధ్య ఐసీఎంఆర్ మొత్తం 60 ఏళ్లు దాటిన ఆరోగ్యవంతులైన 86 మంది వృద్ధులపై అధ్యయనం చేసింది.
54 మందికి బీసీసీ టీకా ఇచ్చారు. మిగతా 32 మందికి ఇవ్వలేదు. వారి శరీరంలో చోటుచేసుకున్న మార్పులను వైద్యులు గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో అనూహ్యంగా రోగనిరోధక శక్తి పెరిగింది. దీంతో వారు కరోనా వ్యాప్తి అడ్డకోగలుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. బీసీజీ టీకా వృద్ధుల్లో ఇమ్యూనిటీ పెంచిందని ఐసీఎంఆర్ సీనియర్ ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ సమిరన్ పండా చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి మరిన్ని ట్రయల్స్, పరిశోధనలు జరగాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. మొత్తం మీద కరోనా వ్యాక్సిన్, చికిత్స పురోగతిలో భారతీయ శాస్త్రవేత్తలు బాగానే కృషి చేస్తున్నారు.