Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తో బ్రెయిన్ దొబ్బిందట! సర్వేలో తేలిన షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 18 Nov 2020 11:30 PM GMTకరోనా కారణంగా విధించిన లాక్డౌన్ చాలా మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. వలసబాధితులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. బస్సులు, రైళ్లు లేక వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అనేక మంది మానసిక వేదనకు గురయ్యారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్‌తో చాలామంది తమ జ్ఞాపకశక్తిని కోల్పోయినట్టు ఈ సర్వే తేల్చింది. చాలామంది ముఖ్యమైన మెయిల్స్ పంపించడం, ఏదైనా ఓ పదం గుర్తుకురావడం, ఇంటికి కావాల్సిన నిత్యవసర సరుకులు ( పాలు వగైరా) తెచ్చుకోవడం కూడా మర్చిపోయారట. కొంతమందికి ముఖ్యమైన వ్యక్తుల పేర్లు సమయానికి గుర్తు రాలేదట. ఈ ఇబ్బందిని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొన్నారట.
అల్జీమర్స్ సొసైటీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనాతో కేర్హోమ్ లలో ఉన్న చాలామందికి తమ వాళ్లను కలుసుకొనే అవకాశం రాలేదు. దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో ఉన్నవారు కూడా తమ దగ్గరివాళ్లకు దూరమయ్యారు. మరోవైపు ఒక్కసారిగా ఇంట్లో ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. లాక్‌డౌన్‌తో మనుషులలో జ్జాపకశక్తి ఎలా దెబ్బతిన్నది అన్న అంశంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
ఓ ఇరవైయేళ్ల కిందట చూసిన సినిమాను కూడా గుర్తుపెట్టుకొనే సామర్థ్యం ఉన్నవారు కూడా చిన్నచిన్న విషయాలను మర్చిపోయారట.
అయితే నిర్బంధం అనేది జ్జాపకశక్తిపై ఎలాంటి ప్రభావం పడింది అన్నదానిపై ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే లాక్ డౌన్ కాలంలో యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగాయి. ఏకాంతంగా గడపాల్సి రావడం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టు సమాచారం. వర్క్ఫ్రంహోం వల్ల కూడా కొన్ని మానసిక రుగ్మతలు ఎదురైనట్టు పరిశోధనలో తేలింది. కరోనా కారణంగా ప్రజల్లో కుంగుబాటు (డిప్రెషన్) రేటు రెండింతలైందని యూకేలోని ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.
ఈ సమస్యను అధిగమించడం ఎలా?
లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే.. ధ్యానం, మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ప్రతిరోజూ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో ఒకేచోట ఉండకుండా కాసేపు ఇంటి బయట వాకిట్లో తిరగడం లేదా.. చిన్నపిల్లలు ఉంటే వారితో గేమ్స్ ఆడటం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. వారాంతాల్లో కుటుంబసభ్యులతో కలిసి ఉండటం.. పెయింటింగ్ లాంటి క్రియేటివ్ పనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.