Begin typing your search above and press return to search.
పురుషుడికి అమ్మతనం సాధ్యమేనా!
By: Tupaki Desk | 15 Sep 2016 7:39 AM GMTప్రకృతీ పురుషుడి కలయికే సృష్టి అని శాస్త్రాలు చెబుతాయి. ప్రకృతి అంటే స్త్రీ అని అర్థం. పిల్లల్ని కనే శక్తి ఒక్క స్త్రీ జాతికి మాత్రమే ఉంది. అండం పిండమై మాతృగర్భంలో నవమాసాలూ ఉన్నాయ ఈ భూప్రపంచంలోకి వస్తుంది. అయితే, భవిష్యత్తులో ఆ శక్తి మగాడికి కూడా వస్తుందని బిట్రన్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్త్రీ సంపర్కం లేకుండానే పురుషుడు బిడ్డల్ని కనగలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ దిశగా జరిగుతున్న పరిశోధనల్లో పురోగతి కనిపిస్తోందట! మహిళల ప్రమేయం లేకుండా బిడ్డల్ని కనేందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ కోసం శాస్త్రవేత్తలు రీసెర్చ్ మొదలుపెట్టారు. మామూలుగా అయితే స్త్రీలోని అండం - పురుషుడి నుంచి విడుదలైన వీర్యకణం కలిసి ఫలధీకరణ చెంది పిండంగా మారతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అండానికి బదులు చర్మ కణంతో వీర్యాన్ని కలిపి.. ఫలదీకరించి పిండాన్ని ఉత్పత్తి చేయబోతున్నారు.
ఈ ఆలోచన ప్రస్తుతానికి కాస్త ఊహాజనితంగా అనిపిస్తున్నా.. భవిష్యత్తులో నిజమయ్యే రోజులు వస్తాయని బ్రిటన్ సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా కొన్ని ఎలుకలపై ఈ పద్ధతిని ప్రయోగించి చూశారు. వీర్యకణాలకు అండ కణాలు జతచేసి ఎలుకలు ఇంజెక్ట్ చేశారు. ఆరోగ్యవంతమైన పిండాలను ఉత్పత్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ ప్రయోగం విజయం తర్వాత వీర్యకణానికి ఇతర టిష్యూ కణాలు జతచేసి పిండాన్ని ఉద్భవింపజేయొచ్చని తేలిందని చెబుతున్నారు. ఇదంతా సమవిభజన పద్ధతిలో చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో 24 శాతం విజయం సాధించామనీ - భవిష్యత్తులో మరింత పురోగతి సాధించబోతున్నాం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి సక్సెస్ అయితే... ఆమెలాగ అతడూ తల్లి కాగలడు! మిగతావారి సంగతి ఎలా ఉన్నా... స్వలింగ సంపర్కులు భవిష్యత్తులో డోనర్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.