Begin typing your search above and press return to search.

మరదలిని అనుభవించాలని ఇలా చేశాడు

By:  Tupaki Desk   |   23 April 2020 5:30 PM GMT
మరదలిని అనుభవించాలని ఇలా చేశాడు
X
మరదలంటే ఆ బావకు పిచ్చి. కానీ ఆ పిచ్చి పీక్స్ స్టేజ్ కి చేరింది. ఎంతంటే ఆమెను అనుభవించాలన్నంతగా మారింది. దాంతో తనలోని కామపిశాచిని నిద్రలేపాడు. కోరికను ఎలాగైనా అమలు చేయాలని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెకు డ్రగ్స్ మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ దారుణం జార్ఞండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

జార్ఞండ్ రాష్ట్రంలోని హజారీఘర్ జిల్లా అచల్జామ్ గ్రామానికి చెందిన ఒక బావ తన మరదలిపై కన్నేశాడు. ఇదే ఊళ్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మరదలిని ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఓరోజు అవకాశం వచ్చింది. ఏదో పనిమీద మరదలు బావ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరదలిని లైన్లో పెట్టాడు. నీళ్లు, స్నాక్స్ ఇచ్చాడు. అవి తిన్న మరదలు మత్తులోకి జారుకుంది.ఆమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లి తనవితీరా అనుభవించాడు. మత్తునుంచి తేరుకున్న మరదలు తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని బావురుమంది.

దీంతో ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బావ బెదిరించాడు. ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన కూతురును తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. బావ పరారీ అయ్యాడు. స్నాక్స్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని పోలీసులు గుర్తించారు.