Begin typing your search above and press return to search.
మద్యం తాగితే లావెక్కుతారా?
By: Tupaki Desk | 25 Aug 2019 1:30 AM GMTపొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం. ఇప్పుడు మద్యం తాగని వాడు అసలు మనిషే కాదు అంటున్నారు ఆధునిక గిరీషంలు. మందు- విందు- చిందు ఇప్పుడు సమాజంలో నిత్యవసరంగా మారిపోయాయి. మద్యం తాగనిదే వీకెండ్ ముగించేవారు ఉండరంటే అతిశయోక్తి కాదు..
అయితే మద్యం సేవించే వారిలో కొందరు అనూహ్యంగా లావెక్కిపోతారని తాజాగా లండన్ పరిశోధకులు తేల్చారు. మందు తాగేటప్పుడు మద్యంలోని కాలరీలతోపాటు అధికంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధికంగా కాలరీలు శరీరంలోకి చేరి కొవ్వుగా మారి లావు అవుతారట..
మద్యం మన శరీరంలోకి చేరగానే దాన్ని ఒక విషపదార్థంగా చూసి కాలేయం నిర్వీర్యం చేసే పనిలో పడుతుంది. దాంతోపాటు వచ్చే ఆహారాన్ని కాలేయం వదిలేస్తుంది. దీంతో మన శరీరంలో ఆహారం తాలూకా కాలరీలు కొవ్వు రూపంలో స్థిరపడిపోతాయి. ఇక మద్యం నుంచి విడగొట్టిన కొవ్వు కూడా ఆల్డ్ 1 ఏ1 అనే ఎంజైమ్ గా మారి కొవ్వుగా మారుతుందట..
ఇలా మద్యం తాగినప్పుడు అతిగా తినే ఆహారం మొత్తం కొవ్వుగా మారి.. మద్యంలోని కొవ్వు జతచేసి తొందరగా లావు ఎక్కుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. రక్తంలో మద్యం ఎక్కువైతే గ్లూకోజ్ ను నియంత్రించే మన శరీరంలోని గ్లూకోగాన్ హార్మోన్ పనిచేయక షుగర్ వ్యాధి తొందరగా రావడానికి కూడా తోడ్పడుతుందని పరిశోధకులు తేల్చారు.