Begin typing your search above and press return to search.

సంసార బంధాలొద్దు.. కాశీలో మునిగారు..

By:  Tupaki Desk   |   15 Aug 2018 4:30 PM GMT
సంసార బంధాలొద్దు.. కాశీలో మునిగారు..
X
అసహాయ మహిళల కోసం మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు ఉన్నాయి.. మహిళలపై ఏదైనా అరాచకం - అక్రమం జరిగితే ప్రభుత్వాలు - పోలీస్ - న్యాయ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. మరి పురుష బాధితుల సమస్యలు ఎవరికీ పట్టవా.. అనాధిగా స్త్రీ పక్షపాతంతో సాగుతున్నఈ సమాజంలో పురుషుడి వేదన.. అరణ్య రోదనే అవుతోంది. అందుకే ఈ సమాజం పురుషుల పట్ల చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ పలువురు తమ వివాహ బంధానికి కాశీలో నీళ్లొదిలేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 150మంది పురుషులు కాశీకి తరలివచ్చి అక్కడి మణికర్ణిక ఘాట్ వద్ద భేటి అయ్యారు.అనంతరం పవిత్ర గంగానదిలో మునిగి తమ వివాహ బంధాలకు ముగింపు పలికారు. పురుషులను మహిళలకు సంరక్షులుగా.. వారికి సకల సౌకర్యాలు సమకూర్చే యంత్రాలుగా చూస్తున్నారని.. ఆ సంప్రదాయ సమాజంలోకి తాము తిరి వెళ్లదలుచుకోలేమని ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సామాజిక కార్యకర్త అమిత్ దేశ్ పాండే తెలిపారు. ప్రస్తుతం ఫెమినిజం మగవాళ్ల హక్కులను కాలరాస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురుషుల హక్కుల కోసం ఇక నుంచి పోరాడుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా వర్నకట్నం వేధింపులు - లైంగిక వేధింపుల పేరుతో పురుషులపై కేసులు పెడుతూ మహిళలు కక్ష సాధిస్తున్నారని.. ఈ తరహా కేసులు మధ్యప్రదేశ్ లో ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.