Begin typing your search above and press return to search.
కేంద్ర కమిటీ నుండి మేనకాగాంధీ అవుట్ .. రీజన్ ఇదే
By: Tupaki Desk | 7 Oct 2021 10:16 AM GMTఒకప్పటి సైద్ధాంతిక పరమైన బీజేపీ ఎప్పుడో చచ్చిపోయిందంటారు. ఇప్పుడంతా మోదీ-అమిత్‌షాల బీజేపీనే అంటుంటారు. కార్పొరేట్ స్టైల్‌లో పార్టీని నడిపిస్తున్నారు ఆ ఇద్దరు. పార్టీ కమిటీలన్నిటినీ తమ అనుచరులతో నింపేశారనే ఆరోపణ ఉంది. అధికారాన్ని ఎరగా చూపించి, సీఏఏ, రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితర చర్యలతో సంఘ్ పరివార్‌ను సంతృప్తి పరుస్తూ బీజేపీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు నరేంద్ర మోదీ. అందుకే, ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట. పెద్ద నోట్ల రద్దు, రఫెల్ మరకలు, కరోనా కట్టడిలో వైఫల్యాలు తదితర ఎన్ని అపవాదులు మూటగట్టుకున్నా, ఇప్పటికీ మోదీనే సుప్రీం లీడర్ గా చెలామని అవుతున్నారు. క్రమక్రమంగా నియంత పోకడలు పోతున్నారు. తప్పైనా, ఒప్పైనా పార్టీకి వ్యతిరేకంగా నోరు విప్పితే,. ఎంతటి నేతపైనైనా వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.
అద్వానీ, జోషిల కథ ఇప్పటికే కాశీకి చేరగా తాజాగా, పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ మేనకాగాంధీపై చర్యలు షురూ అయ్యాయి. ఇంతకీ ఆమె చేసిన తప్పేమీ లేదు. మేనక తనయుడు వరుణ్ గాంధీ చేస్తున్న వరుస ట్వీట్లే మేనకాగాంధీ పై వేటుకు కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. కాగా, రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.
తన మనసును కలచివేసింది అంటూ వరుణ్ ట్వీట్ చేశారు. కాగా బుధవారం కూడా ఈ విషయమై స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది, రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి అని ట్వీట్ చేశారు. గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం. తాజా స్పందనతో మేనకాపై వేటు వేసినట్లు చెప్పుకొస్తున్నారు. మరి, బీజేపీలో ఉన్న ఈ గాంధీ కుటుంబం నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో.
భారతీయ జనతా పార్టీ నూతన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ కమిటీలో మాజీ కేంద్ర మంత్రి మేనక గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలకు చోటు దక్కలేదు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణా బీజేపీ నేతలు విజయశాంతి, ఈటల రాజేందర్ నియమితులయ్యారు. నూతన జాతీయ కార్యవర్గ కమిటీలో 80 మంది రెగ్యులర్ సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.
అయితే ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ఎంపీ మేనక గాంధీ, ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీలకు స్థానం దక్కలేదు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ, కౌన్సిల్స్‌లో సభా పక్ష నాయకులు , మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా ప్రెసిడెంట్స్ తదితరులకు ఈ కమిటీలో అవకాశం కల్పించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణ నుండి జి. కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కింది. తెలంగాణ నుండి డికె. అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చోటు లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి పురుందేశ్వరికి చోటు దక్కింది. జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుండి సత్యకుమార్‌కు స్థానం దక్కింది. తెలంగాణ నుండి విజయశాంతి, ఈటెల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.