Begin typing your search above and press return to search.
తనూశ్రీకి కేంద్ర మంత్రి మద్దతు!
By: Tupaki Desk | 3 Oct 2018 12:37 PM GMTబాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి తనూశ్రీ దత్తా చేసిన సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలసిందే. విలక్షణ నటుడు నానా పాటేకర్, డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, ఓ సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ, తనను నగ్నంగా డ్యాన్స్ చేయాల్సిందిగా వేధించాడని తనూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనూకు మద్దతుగా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు నిలిచారు. తాజాగా, తనూకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బాసటగా నిలిచారు.
తనూశ్రీ దత్తాకు మేనకా గాంధీ మద్దతు తెలిపారు. ఇటువంటి లైంగిక వేధింపుల ఘటనలు జరిగినపుడు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. హాలీవుడ్ లో ఇటువంటి ఘటనలకు వ్యతిరేకంగా ``మీ టూ``ఉద్యమం వచ్చినట్లే ....బాలీవుడ్ లోనూ ఒక ఉద్యమం రావాలని మేనక అభిప్రాయపడ్డారు.`మీటూ ఇండియా` పేరుతో భారత్ లోనూ ఒక ఉద్యమం ప్రారంభించాలని ఆమె పిలుపునిచ్చారు. `మీ టూ ఇండియా `ద్వారా లైంగిక వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని, వాటిపై తాము విచారణ జరుపుతామని అన్నారు. సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి....ఈ తరహా ఉద్యమానికి పిలుపునివ్వడంతో తనూ శ్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మేనక పిలుపు ప్రకారం మహిళలు ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటారో లేదో వేచి చూడాలి.