Begin typing your search above and press return to search.
100 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సమస్యలు : డబ్ల్యూహెచ్ఓ
By: Tupaki Desk | 4 Jun 2022 12:30 AM GMTమానసిక సమస్యలు.. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మందిని వెంటాడుతున్న సమస్య. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు మానసిక క్షోభకు గురవుతున్నారు. చాలా మంది ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే మానసిక అనారోగ్యం అనారోగ్యానికి కారణాలేంటో తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
చిన్న పనులు చేసుకునే వారి నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అందరిలో ఉన్నా.. ఒంటరి అనే భావన.. ఎప్పుడూ ఎక్కడో ఆలోచిస్తూ.. ఏదో లోకంలో ఉండటం వంటివి చేస్తుంటారు మెంటల్ హెల్త్ సమస్యలున్నవారు. అయితే మానసిక అనారోగ్యానికి గల కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతే కాదు.. 100 కోట్ల మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దీనికి గల కారణం వాతావరణంలో మార్పు లేనని తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ప్రజల్లో మానసిక ఆందోళన పెరుగుతోందని చెప్పింది. ఫలితంగా వారు మానసిక క్షోభకు గురై.. నిరాశ, దుఃఖం పెరిగి.. చివరకు ఆత్మహత్యకు పాల్పడేలా దారి తీస్తోందని పేర్కొంది.
ఈ సమస్యకు పరిష్కారంగా.. కొన్ని దేశాలు వాతావరణ మార్పుల నియంత్రణలో అనుసరిస్తున్న విధానాలతో డబ్ల్యూహెచ్ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. కేవలం వాతావరణ మార్పుల్లో నియంత్రణతోనే ఈ సమస్యకు చెక్ పెట్టడం కుదరదని.. మానసిక ఒత్తిడికి గురవుతున్న వాళ్లు.. తమకు సన్నహితంగా ఉండేవాళ్లతో సమస్య గురించి చెప్పుకోవాలని తద్వారా కాస్త ఉపశనం లభించి.. ఆత్మహత్యకు పాల్పడాలనే నిర్ణయాన్ని దూరం చేసే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.