Begin typing your search above and press return to search.

కరోనాతో మానసిక సమస్యలు.. అతి ఆలోచనలతో గందరగోళం

By:  Tupaki Desk   |   29 Jun 2021 1:30 AM GMT
కరోనాతో మానసిక సమస్యలు.. అతి ఆలోచనలతో గందరగోళం
X
కరోనా ప్రపంచం మొత్తంను ప్రభావితం చేస్తోంది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి.. ఉపాది కోల్పోయి.. తమ వారిని కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నారు. నా అనుకున్న వారు మృతి చెందడంతో పాటు జీవనోపాది కోల్పోయిన వారు మానసికంగా కృంగి పోతున్నారు. గతంలో మాదిరిగా వారు ఉండలేక పోతున్నారట. చాలా మంది మానసిక సమస్యలతో వైధ్యులను సంప్రదిస్తున్నారట. ముఖ్యంగా సెకండ్‌ వేవ్ తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి దేశంలో ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ విషయమై అధ్యయనం చేసిన నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ఇలాంటి మానసిక సమస్యల కేసులు అధికంగా ఉన్నాయట. ఢిల్లీలో సెకండ్‌ వేవ్‌ సమయంలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఆసమయంలోనే చాలా మంది ఉపాది కోల్పోవడంతో పాటు అత్యధికులను కోల్పోయారు. స్నేహితులను కోల్పోవడం.. కుటుంబ సభ్యులను కోల్పోవడం వంటివి జరిగాయి. దాంతో ఎంతో మంది మానసికంగా చిక్కి శల్యం అయ్యారు. వారి పరిస్థితి మెల్ల మెల్లగా మెరుగు పడుతూ ఉండగా మరి కొందరి పరిస్థితి మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

ఇంట్లోనే ఉండటం వల్ల కూడా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్‌ జీవితం నుండి ఒంటరి జీవితం లేదా కొత్త జీవితంకు కరోనా వల్ల మారాల్సి వచ్చింది. ఆ మార్పును కొందరు జీర్ణించుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ముందు ముందు ఈ మానసిక సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో ఏం జరుగబోతుంది. తన వారికి ఏమైనా అయితే ఎలా.. నా ఉద్యోగం పరిస్థితి ఏంటీ.. ముందు ముందు వ్యాపారం సాగేనే కొత్త వేరియంట్‌ వల్ల ప్రమాదం ఎక్కువ అయ్యి ఉంటుందా అంటూ రకరకాల ఆలోచనలు వారి మైండ్‌ లో ఎప్పటికి ఉంటూనే ఉంటున్నాయి. ఆ కారణాల వల్ల కూడా మానసిక పరిస్థితి చెడిపోతుందట. అతి ఆలోచనలు దూరం చేసుకోవడంతో పాటు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలని మానసిక వైధ్యులు నిపుణులు చెబుతున్నారు.