Begin typing your search above and press return to search.
#మెన్ టు..మేమూ మనుషులమే - పురుషుల కోసం ఉద్యమం!
By: Tupaki Desk | 14 May 2019 11:05 AM GMTనిన్న మొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా మీటు ఉద్యమం వేడిని రాజేసింది. లైంగిక దాడుల బాధితులం అంటూ వివిధ వృత్తుల్లోని మహిళలు తమ చుట్టూ ఉన్న వారిపై చేసిన ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. మీటు ఉద్యమానికి మీడియా - సోషల్ మీడియా బాసటగా నిలిచింది.
ఆ ఉద్యమం స్ఫూర్తితో కొంతమంది సెలబ్రిటీ మహిళలు చేసిన ఆరోపణలతో ప్రముఖులు అయిన కొందరు పురుషుల జీవితాలు తలకిందుల అయ్యాయి! ఇండియాలో కూడా ఆ ఉద్యమం సంచలనం రేపింది. ఏకంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పదవిని పోగొట్టింది మీటు ఉద్యమం! అంతే కాగా..అంత వరకూ జెంటిట్ మన్ లుగా చలామణి అయిన పలువురు సినీ హీరోలు - నటులు అత్యాచారం కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి!
మీటు హీటులో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో - ఏ సెలబ్రిటీ బతుకు రోడ్డు మీదకు వస్తుందో అనేది ఆసక్తిని రేపింది. బయటి వాళ్లకు అది ఆసక్తి మాత్రమే. అయితే అలాంటి ఆరోపణలను ఎదుర్కొనే వాళ్లకు తెలుస్తుంది దాని వేడి! నిజంగానే ఒక మహిళను వేధించిన వారు - ఆమెకు ఇష్టం లేకుండా అనుచితంగా ప్రవర్తించిన వారు తప్పు చేసిన వాళ్లే!
అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్టుగా.. మహిళల నుంచి వచ్చే ఆరోపణల విషయానికి కూడా రెండో కోణం ఉండనే ఉంటుంది. నిజంగానే బాధితులు ఆరోపణలు చేస్తే వాటికి విలువనివ్వాల్సిందే - అయితే కొందరు బ్లాక్ మెయిలింగ్ కోసం కూడా ఇలాంటి వ్యవహారాలను నెరుపుతారనే పేరుంది!
ప్రముఖులపై ఆరోపణలు చేసే వారిలో కొందరు ప్రచారం కోసం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అలాంటి ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలున్నాయి. గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. పురుషులు తమను లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదు చేసిన మహిళల్లో చాలా మంది ప్రాసిక్యూషన్ వరకూ వెళ్లడం లేదట. లైంగిక దాడినో - లైంగిక వేధింపులనో ఎదుర్కొన్నట్టుగా పురుషులపై ఆరోపణలు చేసిన చాలా మంది పోలీసులకు ఫిర్యాదులు ఇస్తారు. తదుపరి విచారణకు మాత్రం వాళ్లు వెళ్లడం లేదట. ప్రాసిక్యూషన్ సమయంలో కేసులను ఉపసంహరించుకునే వాళ్లే ఎక్కువ మంది అని తెలుస్తోంది.
కొందరు విచారణకు భయపడి కేసులను ఉపసంహరించుకొనవచ్చు. ఇంకొందరు మాత్రం తప్పుడు అభియోగాలతో కేసులు పెట్టి తర్వాత విచారణ సమయంలో వాటిని ఉపసంహరించుకుంటున్నారు అనే విశ్లేషణలున్నాయి.
అయితే ఆలోపే సదరు పురుషుడి కథ అయిపోతుంది. అప్పటికే ఉద్యోగాలు పోయి ఉంటాయి - సమాజంలో చెడ్డ పేరు వచ్చి ఉంటుంది. జీవితాంతం అలాంటి ముద్ర ఒకటి వెంటాడుతుంది! మగాడు కాబట్టి.. అన్నింటికీ ఓర్చుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి!
ఇలా తప్పుడు అభియోగాలతో అనేక మంది మగాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి..అనేది కొంతమంది పురుషుల - సామాజికవేత్తల అభిప్రాయం. ఇప్పుడు వాళ్లే ఉద్యమాన్ని ప్రారంభించారు. దాని పేరే 'మెన్ టు'. మగాళ్లు కూడా బాధితులే అని వారు అంటున్నారు.
ఈ మేరకు ఢిల్లీ లో వారి ర్యాలీ సాగింది. లైంగిక వేధింపుల విషయంలో తప్పుడు అభియోగాలు - తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న మగాళ్ల కోసం - వారికి బాసటగా నిలవడం కోసం పురుష అయోగ్ అనే ఎన్జీవో ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇండియా గేట్ వద్ద ప్రదర్శనతో ఇది దేశం మొత్తం దృష్టినీ ఆకర్షిస్తూ ఉంది. మరి తమపై మహిళలు తప్పుడు ఆరోపణలు చేశారు అని వాపోతున్న పురుషులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావొచ్చేమో!